ఎక్కడ ఆపద అంటే అక్కడ జనసేన ఉంటుంది

కొండెపి: ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలం, సింగరాయకొండకు చెందిన మల్లపెడ శ్రీను గుండె ఆపరేషన్ నిమిత్తం బ్లడ్ అవసరం ఏర్పడింది. విషయాన్ని సింగరాయకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ దృష్టికి రావడంతో వారు వెంటనే స్పందించి రాజేష్, కాసుల శ్రీనివాస్ మరియు జరుగుమల్లి మండలం బిట్రగుంట మామిడి రాధాకృష్ణ మంగళవారం ఒంగోలు అమృత హార్ట్ హాస్పిటల్ లో బ్లడ్ డొనేట్ చేయడం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఎక్కడైనా సమస్య ఉందని తెలియగానే అక్కడ ప్రజలకు అండగా జనసేన ఉంటుంది.