ఎక్కడ కష్టం ఉంటుందో.. ఎక్కడ ఆకలి ఉంటుందో.. అక్కడ జనసేన ఉంటుంది

అన్నమయ్య జిల్లా, రాజంపేట నందలూరు మండలంలోని పాటూరులో ఒక నిరుపేద కుటుంబానికి చెందిన కళ్ళు సరిగా కనపడని చంద్రా అనే అతనికి.. అలాగే నిరాశ్రయురాలైన ఒక ముసలి ఆవిడ కమాల్ బీ కి మంగళవారం శ్రీను మద్దెల, పాటూరు కుంచా శంకర్ ఆర్థిక సహకారం.. అలాగే నెలకు సరిపడ నిత్యావసర సామాన్లు, బియ్యం, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, కూరగాయలు నందలూరు మండల జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో టంగుటూరు ఈశ్వర్, ఉల్లి ఉపేంద్ర, తిప్పాయపల్లి ప్రశాంత్, మహేష్, బాలు, కిట్టయ్య, మంకు వెంకటేష్, గోల్డ్ గణేష్, ఎర్రిపపల్లి సుబ్బు, మారుతీ, నాగార్య, సుబ్రహ్మణ్యం, లెబాక్ ప్రవీణ్, నందు, అనిల్, సర్దార్ బాలు, మెయిన్ పాతూర్ యూత్ మరియు ఇర్రిపాపల్లి యూత్, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక జనసేన నాయకుడికి రాజంపేట జనసేన తరపున కృతఘ్నతలు తెలియజేసారు.