సమస్య ఎక్కడుంటే జనసేన పార్టీ అక్కడ ఉంటుంది: వాసగిరి మణికంఠ

గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠని గుంతకల్ పట్టణం, వాల్మీకి నగర్ కు చెందిన పలువురు యువకులు, కాలనీవాసులు మర్యాదపూర్వకంగా కలిసి కాలనీకి చెందినటువంటి శివాలయం పునరుద్ధరణకు మరియు అక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి వీధి దీపాల యొక్క సమస్యను పరిష్కరించాలని విన్నవించారు. గతంలో కూడా మా కాలనీలో ఎన్నో సంవత్సరాలుగా సమస్యగా ఉన్నటువంటి కరెంటు సర్వీస్ వైర్లను సంబంధిత అధికారులకు తెలియజేసి మార్పించారు. ఆ నమ్మకంతోనే ఈ సమస్య కూడా తీరుస్తారని మీ దగ్గరకు వచ్చాము అని కాలనీవాసుల విన్నవించగా వాసగిరి మణికంఠ మాట్లాడుతూ సమస్య ఎక్కడుంటే జనసేన పార్టీ అక్కడ ఉంటుందని త్వరలోనే కాలనీ సందర్శించి, తక్షణం సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తానని వారు స్పందించని పక్షాన నా సొంత నిధులైన ఖర్చుపెట్టి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆ కాలనీవాసులు గతంలో మణికంఠ చేసిన మంచిని గుర్తు పెట్టుకొని కృతజ్ఞతగా ఘనంగా సత్కరించారు.