ఆదుకోవటంలో, ఆర్థిక సహాయం చేయడంలో జనసైనికులకు ఎవరూ సాటిరారు

కృత్తివెన్ను మండలం, పెద్ద గొల్లపాలెంలో పిడుగు పడి ఒక నిరుపేద వేముల బాలకృష్ణ యొక్క ఇల్లు పూర్తిగా దగ్ధమై.. బాలకృష్ణ కుటుంబం పూర్తిగా నష్టపోయింది. ఈ గ్రామంలో ఉన్న వాలంటరీ వ్యవస్థ గాని, పంచాయతీ ప్రెసిడెంట్ గాని ఎవరూ పట్టించుకోలేదని ఆ కుటుంబం చాలా మనస్థాపానికి గురయ్యారు. జనసేన పార్టీ తరఫునుండి బుధవారం ఆ కుటుంబాన్ని ఓదార్చి తమవంతు సహాయ సహకారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి ఒడుగు ప్రభాస్ రాజు, కూనసాని నాగబాబు, జనసేన మండల అధ్యక్షులు తిరుమణి రామాంజనేయులు, కాజా మణికంఠ, పితాని సురేష్, అడ్డాల చంద్రశేఖర్, కొప్పినేటి రాంబాబు, పెద్ది సతీష్, డొంకిన సతీష్ తదితర జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.