పురపాలక కార్యాలయం వద్ద బల్లలు ఎందుకు తొలగించారు: ప్రతిపక్ష జనసేన నేత శ్రీను

కోనసీమ జిల్లా, అమలాపురం పురపాలక సంఘ సాధారణ సమావేశం చైర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పురపాలక ప్రతిపక్ష నేత, జనసేన 3వ వార్డు కౌన్సిలర్ యేడిద వెంకట సుబ్రహణ్యం(శ్రీను) మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయం వద్ద కాంట్రాక్టర్లు కూర్చునేందుకు వేసిన బల్లలు ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ అవసరం లేని వ్యక్తులు అక్కడ చేరుతున్నారని అందుకు తీసేసామని తెలిపారు.
ఈ విషయంపై సీనియర్ కౌన్సిలర్ మట్టపర్తి నాగేంద్ర జోక్యం చేసుకుని ఆ బల్లల మీద కూర్చుని కాంట్రాక్టర్లు మద్యం బిర్యానీలు తింటున్నారని అందుకు తీసేసామని ఆయన అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు మున్సిపల్ ఆవరణలో జరగకుండా చూడాలే తప్ప బల్లలు తొలగించడం దారుణమని ప్రతిపక్ష జనసేననేత శ్రీను వాగ్వివాదానికి దిగారు. ఎట్టి పరిస్థితిలో బల్లలు పునరుద్ధరించే అవకాశమే లేదని నాగేంద్ర తేల్చి చెప్పారు. 17వార్డులో గోడ నిర్మాణానికి 8.40 లక్షలా..? అని ప్రతిపక్షనేత, జనసేన కౌన్సిలర్ యేడిదశ్రీను ఆశ్చర్యం వ్యక్తం చేసారు.