శివుడిని బిల్వ పత్రాలతో ఎందుకు పూజిస్తారు ? సోమవారం బిల్వనీటితో అభిషేకం చేయడానికిగల అంతర్యం..

సోమవారం శివుడికి ప్రీతీకరమైన రోజు. ఈ రోజున శివుడిని పూజిస్తే అంతా మంచి జరుగుతుంది అని నమ్ముతుంటారు. పిలిస్తే పలుకుతాడని.. ఆరాధిస్తే అనుగ్రహిస్తాడని.. అందుకే మహాదేవుడిని భోళాశంకరుడు అని పిలుస్తుంటారు. నీటితో అభిషేకించిన అనుగ్రహిస్తాడని పురాణాల్లో ప్రతీతి. ఇక మహాదేవుడికి బిల్వ పత్రాలు అంటే ఎంతో ప్రీతీ. ఆ బిల్వ పత్రాలకు అంతటి ప్రాముఖ్యత ఉంది. బిల్వపత్రాలతో పాటు.. నీటితో అభిషేకిస్తే.. శివుడి సంతోషిస్తాడన శాస్త్రాల్లో ఉంది. అయితే బిల్వపత్రాలకు గల ప్రాముఖ్యత ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.

దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని శేషనాగుడితో తీయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో హాలహాలం బయటకు వచ్చిందని చెబుతుంటారు. దీంతో యావత్ ప్రపంచం నాశనం కావడం ప్రారంభమైంది. ఆ సమయంలో మహాదేవుడు గరళాన్ని తన గొంతులో నిల్వ చేసుకున్నాడు. బిల్వ పత్రాలను శివుడు ధరించడంతో ఆ పత్రాల ప్రభావంతో విష ప్రభావం క్రమంగా తగ్గింది. దీంతో దేవతలు మహాదేవుడిని బిల్వపత్రాలతో పూజించడం మొదలుపెట్టారు. ఇక భోళశంకరుడు బిల్వపత్రాలను ఆరగిస్తూ… నీటిని సేవించేవాడు. దీంతో బిల్వ పత్రాల వలన శివుడి శరీరంలో కలిగిన వేడి క్రమంగా తగ్గింది. దీంతో నీళకంఠుడు అని పిలుస్తుంటారు. అప్పటినుంచే మహాదేవుడిని నీరు మరియు బిల్వపత్రాలతో పూజించడం ప్రారంభమైందని ప్రతీతి.

బిల్వపత్రాలకు గల నియమాలు..

☞ బిల్వపత్రాల మూడు ఆకుల సముహాన్ని శివుడికి అర్పిస్తారు. అన్ని తీర్థయాత్రలు ఆ సముహంలోనే ఉన్నాయని ప్రతీతి.

☞ సోమవారం రోజున మహాదేవుడిని పూజించడం వలన సుఖసంతోషాలు కలుగుతాయని పురాణాలు చెబుతుంటాయి.

☞ బిల్వపత్రాలను అపవిత్రమైనవి.

☞ బిల్వపత్రాలను ఎప్పుడు తరగకూడదు.

☞ బిల్వపత్రాలను ఎల్లప్పుడు శివుడికి తలక్రిందులుగా అర్పిస్తారు. అంటే మృదువైన ఉపరితలం వైపు శివుడి విగ్రహాన్ని తాకిన తర్వాతే బిల్వపత్రాలను అర్పిస్తారు. రింగ్ ఫింగర్, బోటనవేలు మరియు మధ్యవేలు సహాయంతో బిల్వపత్రాలను అందించాలి.. వాటితో శివుడిని అభిషేకించాలి.