పవర్ స్టార్ అంటే ఎందుకిష్టం?.. అభిమానులకు బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ప్రశ్న

పవర్ స్టార్ పవర్ కల్యాణ్‌ అంటే ఎందుకిష్టం? ఈ ప్రశ్నకు అభిమానులు ఎలాంటి సమాధానాలు చెబుతారు? ఇదే అనుమానం హైదరాబాద్‌లోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్‌కు వచ్చింది. గురువారం పవన్ కల్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన ఇదే ప్రశ్న అడిగారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలకు బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ అయిన డాక్టర్ ఆండ్రూ ప్లెమింగ్.. తమ వైపు నుంచి పవన్ కల్యాణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఆ వెంటనే ‘‘పవన్ కల్యాణ్ ఎందుకు మీ హీరో అయ్యాడు?’’ అనే ప్రశ్నకు పది పదాల్లో సమాధానం చెప్పాలని పవన్ అభిమానులను అడిగారు. ఇక అభిమానులు ఊరుకుంటారా? ఈ ట్వీట్‌కు రిప్లైల మీద రిప్లైలు ఇచ్చేస్తున్నారు. తమకు పవన్ అంటే ఎందుకు అభిమానమో చెబుతున్నారు. దీంతో ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది.