ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాహనాల పార్కింగ్ వసూలు ఎందుకు?

  • జనసేన యువనాయకులు హుస్సేన్ ఖాన్

విజయనగరం: ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాహనాలు పార్కింగ్ కోసం ఎందుకు డబ్బులు వసూలు చేస్తున్నారని జనసేన పార్టీ యువ నాయకులు, జనసేన మైనారిటీ జిల్లా నాయకులు హుస్సేన్ ఖాన్ ప్రభుత్వాన్ని నిలదీశారు.. ఈ విషయమై సోమవారం ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి కు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాహనాల పార్కింగ్ రుసుము వసూలు చేయకుండా చేయాలని జనసేన నాయకులు యర్నాగుల చక్రవర్తితో కలసి హుస్సేన్ ఖాన్ వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, మాత శిశు ఆరోగ్య కేంద్రానికి (ఘోష ఆసుపత్రి) వచ్చే పేద, మధ్య తరగతి రోగుల వద్ద వాహనాల పార్కింగ్ రుసుమును ముక్కుపిండి వసూలు చేస్తున్నారని, డబ్బులు పెట్టుకోలేని వారే ఉచితంగా వైద్యం కోసం జిల్లా నలుమూలలనుండి పేదలు వస్తుంటారని, అటువంటి వారిపై డబ్బులు వసూలు చేయడం దారుణమని, వీటిపై త్వరత గతిన నిర్ణయం తీసుకుని ప్రజలపై ఈ పార్కింగ్ వసూలు భారం లేకుండా చేయాలని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీ రాజ్, మెరక ముడిదాం మండల అధ్యక్షులు కృష్ణవేణి పాల్గొన్నారు.