మినగల్లు ఇసుక అక్రమ తవ్వకాలు ఎందుకు..?

నెల్లూరు, రాష్ట్ర వ్యాప్తంగా 110 ఇసుక రీచ్ లు తవ్వకాలు నిలపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉండగా మినగల్లు ఇసుక అక్రమ తవ్వకాలు ఎందుకు..? ఎన్ఎస్ పురం డంపింగ్ యార్డ్ ఇసుక బిల్లుతో మినగల్లు టు లో ఇసుక తవ్వకాలు ఆపలేదు..? భారీ యంత్రాలతో ఆంధ్రప్రదేశ్ లో తవ్వుతున్న 110 ఇసుక రీచ్ ల తవ్వకాలను ఆపాలి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి, 18 కోట్లు ఫైన్ వేసిన విషయంలో జేపీ కంపెనీపై కేసు నడుస్తుండగా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇసుక తవ్వకాలు ఆపింది లేదు, ఈ విషయాన్ని ప్రశ్నిస్తూ జనసేన పార్టీ జిల్లా ప్రధాన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఉపాధ్యక్షుడు సుధీర్ మినగల్లు గ్రామంలోని ఇసుక రీచ్ ను విజిట్ చేసి నిర్వాహకులను అనుమతులు అడుగుగా చూపించలేకపోయారు. తవ్వకం ఆపివేయాలని సుప్రీంకోర్టు జీవో ఉండగా ఎందుకు తవ్వుతున్నారని ప్రశ్నించగా.. వారు సరైన సమాధానం చెప్పట్లేదు. సెబ్ అదికారులను ప్రశ్నించగా పై అధికారులు రిపోర్ట్ చేస్తాను, నేను అక్కడికి రాలేను మీరు అర్థం చేసుకోగలరు అని సమాధానం ఇచ్చారు.అనంతరం ఎస్పీకి ఫోన్ చేయగా కార్యాలయం వస్తే మీ క్లారిటీ ఇస్తానని తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేస్తే మాకు సంబంధం లేదు. ఇసుక తవ్వకం ఇప్పటిది కాదు. సెబ్ అధికారులని వివరణ కోరండి అని అడిగారు. సరైన ధ్రువపత్రాలు చూపకుండా మేము అక్కడి నుంచి కదిలం అని జన సైనికులు నిలదీయగా ఎస్సై వచ్చి రాష్ట్ర మొత్తం మీద ఎక్కడా తవ్వకాలు ఆపింది లేదు సుప్రీంకోర్టు ఆదేశాలు కాదు. మాకు కలెక్టర్ నుంచి ఉత్తర్వులు రాలేదు వస్తే అట్లే ఆపుతామని సమాధానం ఇచ్చారు. పై పెచ్చు అనుమతులు కోసం అడిగితే అరెస్టు చేసి కేసులు కడతాం తెలిపారు. గతంలో వచ్చిన వరదలు కారణంగా ఊరు మొత్తం మునిగిపోయిన పరిస్థితి దానికి పదింతలు ఎక్కువ ఇసుక తవ్వి తరలిస్తున్నారు, దీని వల్ల రానున్న రోజుల్లో గ్రామాలు మొత్తం ప్రమాదం బారిన పడే అవకాశం ఉందివవీటిని దృష్టిలో పెట్టుకొని సహకరించాలని కోరగా వారు నిరాకరించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా బేకాతరుచేస్తూ అధికారి యంత్రాంగం పెత్తందారులకు మద్దతు ఇవ్వడాన్ని తప్పుపడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొడితేనే సహజ వనరుల దోపిడీ ఆగుతుంది. అన్ని పత్రాలు సేకరించి జిల్లాలో యదేచ్చగా జరుగుతున్న ఇసుక, గ్రావెల్, మట్టి, అక్రమ రవాణాపై గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించి అక్రమ రవాణాను అరికడతాము. జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాల గురించి కలెక్టర్ కి ఫిర్యాదు చేసి రామన్న రోజుల్లో ఇసుక తవ్వకాల ఆపే విధంగా చర్యలు చేపడతామని గునుకులు కిషోర్ తెలిపారు.