సవాలు విసిరడం ఎందుకు, పోలీసులతో అడ్డుకోవడం ఎందుకు? తిరుపతి జనసేన

  • దమ్ముంటే నగిరిలో మా ఇంటికి రండి అన్న మంత్రి రోజా మాటలకు దీటుగా గురువారం ఉదయం నగిరికి బయలుదేరిన తిరుపతి జనసేన నాయకులు.

తిరుపతి, నగిరి రండి అంటూ మంత్రి రోజా వేసిన సవాలుకు జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలుగా ఆ సవాలను స్వీకరించి తిరుపతి నుంచి బయలుదేరుతుంటే తెల్లవారక ముందే పోలీసులతో హౌస్ అరెస్టులు చేయించారని మంత్రి రోజాపై జనసేన తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, మరియు జిల్లా నాయకులు కీర్తన, హేమ కుమార్, నాయకులు జనసైనికులు తమదైన శైలిలో విమర్శలకు దిగారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన నేతలు మాట్లాడారు, ఈ సందర్భంగా జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి నాని, మంత్రి రోజా చేసిన విమర్శలను ఖండించిన జనసేన నాయకులపై మంత్రి రోజా మీకు దమ్ముంటే నగిరిలో మా ఇంటికి రావాలంటూ జనసేన నాయకులకు సవాల్ విసిరారన్నారు, తీరా బయలుదేరితే పోలీసులతో అక్రమంగా అరెస్టులు చేయించారని, శుక్రవారం తిరుపతికి వస్తున్న సీఎంను కలుస్తామని ఈ ఘటనపై జగన్ మోహన్ రెడ్డికి వినతిపత్రాన్ని ఇవ్వడానికి జనసేన నాయకులకు సీఎం అపాయింట్మెంట్ ఇవ్వాలని, లేనిపక్షంలో సీఎం పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆకేపాటి సుభాషిణి, కీర్తన, విజయ రెడ్డి, ఆదికేశవ, మనోజ్, నవ్య అతిధులు పాల్గొన్నారు.