జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగంలో ఆంధ్రప్రదేశ్ నడుస్తుందా?

  • జనసేన నాయకుల అక్రమ అరెస్టు

విజయవాడ వెస్ట్: సీఎం గో బ్యాక్ నిరసన కార్యక్రమంలో నిరసన తెలుపుతున్న జనసేన పార్టీ చేనేత కార్యదర్శి న్యాయవాది ఎం. హనుమాన్, ఏలూరు సాయి శరత్, 39 డివిజన్ అధ్యక్షులు, ఇతర జనసేన నాయకులను బుధవారం అక్రమంగా అరెస్టు చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఈ సందర్భంగా హనుమాన్ మాట్లాడుతూ కనీసం భారత రాజ్యాంగంలో పూర్తి పిల్లర్ అయిన మీడియా ముందు మాట్లాడ డానికి కూడా పోలీసులు అనుమతించడం లేదంటే ఇదేం రాజ్యం జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగంలో ఆంధ్రప్రదేశ్ నడుస్తుందా అని ఎద్దేవా చేసారు.