జనసేన-టిడిపి ప్రభుత్వం రాగానే పరిశ్రమలు తీసుకువస్తాను: అతికారి దినేష్

నందలూరు మండల కేంద్రంకు విచ్చేసిన అతికారి దినేష్ కి పేటగడ్డ ప్రజలు ఘనస్వాగతం పలికారు.ఈ సందర్భంగా నందలూరు మండల జనసేన నాయకులు మస్తాన్ రాయల్, రత్నంలు అతికారి దినేష్ సహకారంతో ఆత్మీయ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిధిగా విచ్చేసిన అతికారి దినేష్ తనను ఇంత అభిమానిస్తున్న పేటగడ్డ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ నన్ను ఇంత అభిమానిస్తున్న ఈ ప్రాంతం నాకు నా సొంత మండలం సిద్ధవటం ఎలాగో నాకు నందలూరు మండలం అంతే అని తెలియజేశారు. నందలూరు యువత కొరిక మేర నందలూరు మండల కేంద్రంలో లైబ్రరీ ఏర్పాటు చేస్తానని హామి ఇవ్వడం జరిగింది. అలాగే మన ప్రాంతం నుంచి వలసలు ఎక్కువగా ఇవి ఆగాలంటే మీ బిడ్డను అయిన నాకు అండగా ఉండండి మన ప్రాంతంలో జనసేన-టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిశ్రమను తీసుకవస్తాను అని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నందలూరు మండల నాయకులు కొట్టే శ్రీహరి, ఉపేంద్ర, నరసింహా చెర్రి, మంకు వెంకటేశ్, గుగ్గిళ్ళ నాగర్జున జనసైనికులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.