కోర్టు దగ్గరనుంచి అనుమతి తెచ్చుకొని పాదయాత్ర కొనసాగిస్తా: బొర్రా

సత్తెనపల్లి, జనసేన సత్తెనపల్లి నియోజకవర్గ నేత బొర్రా వెంకట అప్పారావు ఆధ్వర్యంలో జరుగుతున్న జనసేన-తెలుగుదేశం సంకల్ప పాదయాత్రను పోలీసులు అడ్డుకున్న క్రమంలో సత్తెనపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష శనివారం మూడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా దీక్షా శిబిరాన్ని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కటికం అంకారావు, గురజాల నియోజకవర్గ నాయకులు, తాడికొండ నాయకులు సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు, వివిధ పార్టీల నాయకులు బొర్రా అప్పారావుకి పూలమాలలు వేసి ఆయన చేస్తున్న రిలే నిరాహార దీక్షకు తమ సంఘీభావం తెలిపారు.

ఈ సందర్బంగా జనసేన సత్తెనపల్లి నియోజకవర్గ నేత బొర్రా వెంకట అప్పారావు మాట్లాడుతూ.. పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చి మళ్లీ నాకు ప్రాణహాని ఉందంటూ పాదయాత్ర నిలిపివేశారు. దానికి నిరసనగా సత్తెనపల్లి పార్టీ కార్యాలయంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాను. నేటికి రిలే నిరాహార దీక్ష మూడో రోజుకు చేరింది. మేము మూడు రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్నా అంబటి రాంబాబు దున్నపోతు మీద వాన పడ్డట్టు కూడా లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరు హక్కులు వాళ్ళు పొందగలిగేలాగా ఉండటం లేదు. మేము దైవ సన్నిధి చేరటానికి మాత్రమే పాదయాత్ర చేస్తున్నాం. మేము అసభ్య డాన్సులు కోసం, సంక్రాంతి డ్యాన్స్ ల కోసం అనుమతి అడగటం లేదు. గాజు గ్లాసు మీ గుండెల్లో గుచ్చుకుంటదనే భయంతో ఆపారు. మీరు వికృత ఆనందం పొందుతున్నారు రాంబాబు. పవన్ కళ్యాణ్, అంబటి రాంబాబు మీద నన్ను రామబాణంలా వదిలారు. పవన్ కళ్యాణ్ ను తిట్టడం వృత్తిగా, పనిగా పెట్టుకున్నావ్. గెలిచినాక ఏం పని చేసావ్ అని మేము నిన్ను ప్రశ్నిస్తాం. నువ్వు ఓట్లు అడగటానికి వచ్చినప్పుడు ప్రతి గ్రామంలో జనసేన మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. నాలుగు రోజులు పాదయాత్ర ఆపుతావు కోర్టు దగ్గరనుంచి అనుమతి తెచ్చుకొని పాదయాత్ర కొనసాగిస్తా. మేము ఎలాంటి అసాంఘిక, దౌర్జన్య కార్యక్రమాలకు చెయ్యటానికి అనుమతి అడగటం లేదు. రాంబాబు వచ్చినా, పోలీసులు, ఎవరొచ్చినా ఈ పాదయాత్రను అడ్డుకోలేరు మేము పాదయాత్ర కొనసాగిస్తాం. అంబటి రాంబాబు గారూ ఇంకొక ముఖ్య విషయం మీరు తెలుసుకోండి మీకు కావాల్సిన వాటికి కరువు లేదోమో గాని, ప్రజలందరికీ విపరీతమైన కరువు వచ్చింది. పంటలన్నీ ఎండిపోయి రైతుల అహర్నిశలు కష్టపడుతున్నారు. రైతులు నీళ్ల కోసం పైపులతో, ట్రాక్టర్లతో నీళ్లు తెచ్చు కొని అనేక కష్టాలు పడుతున్నారు. మీకు వారి కష్టాలు కనబడటం లేదు. మీకు మాత్రం కరువు లేదు. పంటలు పండక, పశువులకు మేత లేకపోతే వాటిని కరువు అంటారు. కనీసం గ్రామాల్లో తిరిగి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వలకు తెలియజేసి కరువు ప్రాంతాలనన్న ప్రకటించండి.

జనసేన ఉమ్మడి గుంటూరు ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు మాట్లాడుతూ… గత నెల 24న పోలీసు వారి ఓరల్ అనుమతితో సంకల్ప యాత్ర ప్రారంభించాము. నాలుగైదు రోజులు విరామం తర్వాత అనుమతులతో 1 వ తేదీ పాదయాత్ర కొనసాగించాము.ఒకటో తారీకు పాదయాత్ర చేసుకొమని అనుమతి ఇచ్చారు. 1 తేదిన పాదయాత్ర చేశాం కానీ ఆరోజు ఆపలేదు. అధికార పార్టీ వత్తిళ్లతో రెండో తారీకు పాదయాత్ర అడ్డుకున్నారు. గ్రామాల్లో సమస్యలు అనేకం ఉన్నాయి, మోక్కు పెరుతో పాదయాత్ర చేస్తున్నప్పటికీ, ప్రజా సమస్యలు బయటకు తీసుకొచ్చి అధికారుల దృష్టికి తీసుకొద్దామని. ప్రజా శ్రేయస్సు కోసం పాదయాత్ర చేపట్టాము.ప్రజా కంటకులు పాదయాత్ర అడ్డుకుంటున్నారు. అంబటి రాంబాబు జనసేన పార్టీ ఎదుగుదల ఓర్చుకోలేక పోలీసులతో కుట్ర చేస్తున్నారు. పెదకూరపాడు నియోజకవర్గం, ఇంకా అనేక నియోజకవర్గల నుంచి వచ్చి మాకు సంఘీభావం తెలియజేస్తున్నారు. నేడు గురజాల నియోజకవర్గ మిత్రులు, తాడికొండ నియోజకవర్గ నుండి వచ్చి సంఘీభావం తెలియజేశారు. భవిష్యత్తులో ప్రజాస్వామ్యబద్ధంగా చేసే పోరాటాలకు మీరు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను.

ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కటికం అంకారావు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉండటం రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. కానీ ప్రభుత్వాలు వాటిని కాల రాస్తున్నాయి. పాదయాత్రకు అధికారపార్టీ అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తున్నారు. ఇక్కడి సీఐ,ఎ స్ఐలు పర్మిషన్ ఇచ్చి ఒకరోజు పాదయాత్ర చేయించి తర్వాత రోజు అడ్డుకున్నారు. దీని వెనక వైసిపి కుట్రఉంది. నిజంగా అలాంటి సంఘటనలు జరిగి మీకు రిపోర్టు ఉంటే మీరు రక్షణ కల్పించాలి కదా. ఈ నియోజకవర్గ నాయకులు అంబటి రాంబాబుకి ప్రాణహాని ఉందేమో కానీ మాకు కాదు. ఖమ్మంలో అతనిపై దాడి చేసే కార్యక్రమం చేశారు. ముఖ్యమంత్రికి మేము విన్నవించుకుంటున్నాము అదొకటే అంబటి రాంబాబుకు సెక్యూరిటీ కల్పించండి. పూర్తి పర్మిషన్లతో పాదయాత్ర కచ్చితంగా చేస్తాము, ఏ పోలీసులైతే అడ్డుకున్నారో వాళ్ల సెక్యూరిటీతో పాదయాత్ర కొనసాగిస్తాము. భవిష్యత్తులో అంబటి రాంబాబుకి తగిన బుద్ధి చెబుతాము. మా ప్రభుత్వం వచ్చిన తరువాత కచ్చితంగా మీకు బుద్ధి చెబుతాము. ముప్పాళ్ళ మండలం గొళ్ళపాడు గ్రామములో చర్చి పుననిర్మాణం కొరకు సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు 25,000 రూపాయలు చందాను తెలుగు బాప్టిస్ట్ చర్చి నిర్వాహకులకు అందజేశారు.

అనంతరం రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న బొర్రా వెంకట అప్పారావుకు సిపిఐ పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యులు నరిసేటి వేణుగోపాల్ నిమ్మరసం ఇచ్చి శనివారం దీక్షను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు, జిల్లా కార్యదర్శి కటికం అంకారావు, పల్నాడు జిల్లా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నరిసేటి వేణుగోపాల్, సత్తెనపల్లి నియోజకవర్గ కార్యదర్శి పి.యిర్మీయా సత్తెనపల్లి 7వ వార్డు కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, సత్తెనపల్లి మండల అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వరావు, నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి, జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యుడు బత్తుల కేశవ, పూర్ణ, రఫీ, గురజాల, తాడికొండ నియోజకవర్గ, సత్తెనపల్లి టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.