ఫ్లెక్స్ లు తీయమంటే అరెస్ట్ చేస్తారా జగన్ రెడ్డి గారూ..: ధ్వజమెత్తిన రెడ్డి అప్పల నాయుడు

జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు (చినబాబు) ను అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులు..

ఏలూరు: ఆంధ్ర రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని, వైయస్ జగన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని రెడ్డి అప్పలనాయుడు మండిపడ్డారు. బుధవారం ఏలూరు జనసేన కార్యాలంలో మీడియా ముఖంగా ఆయన మాట్లాడుతూ.. భీమవరం టూ టౌన్ సిఐ కృష్ణ భగవాన్, ఇద్దరు ఎస్సైలు, 10 మంది కానిస్టేబుళ్లు, స్పెషల్ ఫోర్స్ తో కలిసి అక్రమంగా వ్యవహరిస్తూ ఈరోజు ఉదయాన్నే ఇంటికి వచ్చి దౌర్జన్య పూరితంగా అప్రజాస్వామికంగా, అన్యాయంగా అక్రమంగా మా జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు (చినబాబు) గారిని అరెస్టు చేయడం జరిగింది.. ఉదయం నుంచి హైడ్రామా నడిపి ఎట్టకేలకు ఆచంటలోని పోడూరు పోలీస్ స్టేషన్లో మా అధ్యక్షుడిని నిర్బంధించడం జరిగింది.. ఏదైతే ప్రజల పక్షాన మాట్లాడుతున్న జనసేన పార్టీ నాయకుడిని, కార్యకర్తలని టార్గెట్ చేసి ఎవరైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో వారి మీద అక్రమ కేసులు బనాయించి, వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.. జనసేన నాయకుల్ని భయపెడితే ప్రజలు కూడా భయపడతారు అనే కుట్రపూరితమైన ఆలోచనతో ఈరోజు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు గోవిందరావు గారిని అక్రమంగా ఒక బందిపోటుని అరెస్టు చేసినట్లు ఉదయం 5:30 నుండి పోలీసులు రౌడీలాగ వ్యవహరించారని మండిపడ్డారు.. పోడూరు పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి ఎవరిని రానివ్వకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.. ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రజల పక్షాన మాట్లాడకూడదు.. ఏ ఒక్క గొంతు వినిపించకూడదు.. వైసీపీ ప్రభుత్వం అక్రమ అరెస్టుతో గుండా పరిపాలన సాగిస్తున్నారు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వారి అనుచరులు, కొంతమంది శాసనసభ్యులు ఈ రకమైన ఆలోచనతోనే ఉన్నారు.. దీన్ని ఉమ్మడి జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా తీవ్రంగా ఖండిస్తున్నాం.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని తక్షణమే అక్రమంగా అరెస్టు చేసిన మా జిల్లా అధ్యక్షుడిని విడుదల చేయాలని ఆ ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం.. అది కాని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చేపడుతామని వైసీపీ ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తున్నామని అన్నారు..