నెల్లూరు సిటీని జనసేన అడ్డాగా మారుస్తా: కేతంరెడ్డి వినోద్ రెడ్డి

  • ఘనంగా 100వ రోజు పవనన్న ప్రజాబాట
  • వి.ఆర్.సి నుండి గాంధీబొమ్మ వరకు జనసైనికుల భారీ ర్యాలీ
  • తప్పెట్లు, బాణసంచా హోరు నడుమ అడుగడుగునా కేతంరెడ్డి వినోద్ రెడ్డిపై పూలవర్షం కురిపించిన కార్యకర్తలు
  • కాబోయే సీఎం పవన్ కళ్యాణ్, కాబోయే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే కేతంరెడ్డి వినోద్ రెడ్డి అంటూ నినాదాల హోరు
  • నెల్లూరు నడిబొడ్డున గాంధీబొమ్మ సెంటర్లో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ డ్రామాలను తీవ్ర స్థాయిలో ఎండగట్టిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి

నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 100వ రోజున ఘనంగా జరిగింది. తొలుతగా వి.ఆర్.సి మైదానంలో గుమిగూడిన కార్యకర్తల సమూహంతో బయల్దేరిన కేతంరెడ్డి వి.ఆర్.సి కూడలిలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం వీరమహిళలు హారతిచ్చి విజయతిలకం దిద్దగా కార్యకర్తలతో కలిసి గాంధీబొమ్మ వరకు ర్యాలీ చేపట్టారు. తప్పెట్లు, బాణాసంచా హోరు నడుమ అడుగడుగునా కేతంరెడ్డిపై కార్యకర్తలు పూలవర్షం కురిపించారు. దారి పొడవునా కాబోయే సీఎం పవన్ కళ్యాణ్, కాబోయే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే కేతంరెడ్డి వినోద్ రెడ్డి అంటూ జనసైనికులు నినాదాలతో హోరెత్తించారు. అనంతరం గాంధీబొమ్మ వద్దకు చేరిన కేతంరెడ్డి ఆ కూడలిలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. నెల్లూరు సిటీ నియోజకవర్గం నుండే కాకుండా జిల్లాలోని ఇతర ప్రాంతాలు, రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుండి వచ్చిన పలువురు శాలువాలతో, పూలమాలలతో, నగర నియోజకవర్గ కార్యకర్తలు గజమాలతో కేతంరెడ్డి వినోద్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. అనంతరం కేతంరెడ్డి గాంధీబొమ్మ కూడలిలో ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించి, మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ మే 17వ తేదీన తాను నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మొదలుపెట్టిన పవనన్న ప్రజాబాట ఎటువంటి ఆటంకాలు లేకుండా, నిర్విరామంగా 100 రోజులు పూర్తి చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పవనన్న ప్రజాబాటకి ప్రజల్లో దక్కుతున్న ఆదరణ తమలో మరింత ఉత్సాహం నింపుతోందని, 365 రోజులు దాటినా సరే ఆగకుండా నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను తెలుపుతూ పవన్ కళ్యాణ్ భావజాలాలను తీసుకెళ్లి పవనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన ఆవశ్యకతను తెలుపుతామన్నారు. నవరత్నాల పేరు చెప్పి వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని ఎలా మోసం చేస్తుందో వివరించారు. ఆస్తులమ్మి నెల్లూరు సిటీ ప్రజలకు పెట్టానని ఇన్ని రోజులుగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చెప్తూ వచ్చారని, ఏ ఆస్తులు ఎక్కడ అమ్మి ఏ ప్రజలకు పెట్టారో తెలుపగలరా అని ఎద్దేవా చేశారు. మంత్రిగా మూడేళ్లు ఉండి నెల్లూరు సిటీకి అనిల్ కుమార్ యాదవ్ చేసిందేమీ లేదని, పైపెచ్చు అధికారంలోకి వస్తే 9 అంకణాల్లో ఇళ్ళు కట్టించి ఇస్తామని, ఒకవేళ ప్రభుత్వం ఇవ్వకపోతే తన సొంత స్థలాన్ని పేదలకు పంచి ఇళ్ళు కట్టిస్తానన్న అనిల్ కుమార్ యాదవ్, నేడు నగరంలోని పలు ప్రాంతాల్లో తన బినామీ కాంట్రాక్టు కాలువల పనులకు అడ్డుగా ఉన్నాయని పేదలకు ఎలాంటి ఆసరా చూపకుండా నిట్టనిలువునా ఇళ్ళను కూల్చాడని దుయ్యబట్టారు. మంత్రి పదవి పోయినా అనిల్ కుమార్ యాదవ్ అక్రమ ధనదాహం తీరలేదని, అన్ని రకాలుగా మోసం చేసిన అనిల్ ని నెల్లూరు సిటీ ప్రజలు నమ్మడం మానేశారని, ఎప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో గెలిచేది జనసేన పార్టీనే అని, అందులో ఎలాంటి సందేహాలు లేవని, నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని జనసేన పార్టీ అడ్డాగా మారుస్తానని కేతంరెడ్డి వినోద్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి, కాకు మురళీ రెడ్డి, ఆమంచర్ల శ్రీకాంత్, మేకల ప్రవీణ్ యాదవ్, చెరుకూరి హేమంత్ రాయల్, కుక్కా ప్రభాకర్, జీవన్, అంచల సారధి, ముడూరి కార్తీక్, కాయల వరప్రసాద్, పేనేటి శ్రీకాంత్, షేక్ జాఫర్, రాము, ఈశ్వర్, చరణ్, ప్రేమ్, వీరమహిళలు శిరీష రెడ్డి, ఝాన్సీ, కుసుమ, సునంద, సుజన, మేరీ, ప్రీతి, జనసేన సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్, చిరంజీవి యువత నాయకులు కారంపూడి కృష్ణారెడ్డి, ఏటూరి రవి తదితరులు పాల్గొన్నారు.

May be an image of 5 people, people standing, people walking, outdoors and crowd
May be an image of 11 people and people standing
May be an image of 2 people, people standing and outdoors
May be an image of one or more people, people standing and outdoors