ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మళ్లీ పోటీ చేస్తా: ఈట‌ల రాజేంద‌ర్

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను త‌మ పార్టీలో చేరాల‌ని బీజేపీ అధికారికంగా ఆహ్వానం పలికినట్లు వార్త‌లు వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ నేతలతో ఈటల ర‌హ‌స్యంగా స‌మావేశం కూడా అయ్యారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై ఈటల రాజేంద‌ర్ తాజాగా స్పందించారు.

ఓ మీడియా ఛానెల్‌తో ఆయ‌న ఈ రోజు మాట్లాడుతూ… తాను మద్దతు కోరేందుకే బీజేపీ నేతలను కలిశానని, అంతేగానీ, బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు మాత్రం అవాస్తవమని చెప్పారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మళ్లీ హుజూరాబాద్‌ నుంచే పోటీ చేయాలనుకుంటున్నానని చెప్పారు. దీనిపై త్వరలోనే అధికారికంగా తన నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు.