రైతులకు నీరందిస్తారా? లేదా నష్టపరిహారం ఇస్తారా?

  • జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర

జగ్గంపేట నియోజకవర్గం: ప్రజా సమస్యల పరిష్కారం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన జనం కోసం జనసేన మహాయజ్ఞం 683వ రోజు కార్యక్రమంలో భాగంగా ఆదివారం జగ్గంపేట మండలం కాండ్రేగుల గ్రామంలో ఇంటింటికీ తిరుగుతున్న జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర, ఈ సమయంలో ప్రజలందరూ చెప్తున్న ఒకే ఒక సమస్య “రైతులకు సాగునీరు లేకపోవడం.” రైతులంతా కలిసి స్వయంగా సూర్యచంద్రను వారి పోలాలలోనికి తీసుకుని వెళ్ళి వారి గోడు వెళ్లబోసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ నేపథ్యంలో కాండ్రేగుల గ్రామంలోని రైతులు నిమ్మల శ్రీను, దారబందం వెంకట రమణ, తుంపాల సోమన్న దొర, వరుపుల రంగారావు, సూరాబత్తుల ఏసుబాబు, తుంపాల రాజు, కర్నాకుల రమణ మాట్లాడుతూ పుష్కర కాలువ నీరు వస్తుందని ఆ నీటిపై ఆధారపడి ఒక్కొక్కరు ఎకరానీకి 35 నుంచి 50 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి వరి, మిరప, బెండ లాంటి పంటలు వేశామని కానీ వస్తుందనుకున్న పుష్కర సాగు నీరు సమయానికి రాక పెట్టిన పంటలు అన్ని ఎండి పోయి కనీసం పశువులు తినడానికి కూడా పనికిరాకుండా పోయిందని వాపోయారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ సూర్యచంద్ర మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వలన తాళ్లూరు పుష్కర ఎత్తిపోతల పథకంలో పాడైపోయిన మోటార్లను, పైపు లైన్లను తగిన సమయంలో మరమ్మతులు చేయించక రైతులకు సాగు నీరు అందిచక వారు వేసిన పంటలు అన్ని ఎండిపోయి వారు నష్టాలు పాలవడానికి కారణం అయ్యిందని అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవహరించడం వలన రైతులకు నష్టం వాటిల్లుతుందని అన్నారు. ప్రభుత్వ అధికారులు, నాయకులు వెంటనే స్పందించి పంట నష్టపోయిన రైతులందరికీ ఎకరాకు 50 వేల రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలనీ లేదంటే పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందే వరకు దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేశారు.