పార్టీని మరింత బలంగా ముందుకు తీసుకెళ్తా: బైరపోగు సాంబశివుడు

  • కోఆర్డినేటర్ గా నియమించినందుకు పవన్ కళ్యాణ్ కు మరియు తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన బైరపోగు సాంబశివుడు

కొల్లాపూర్ నియోజకవర్గానికి జనసేన పార్టీ కోఆర్డినేటర్ గా నియమించినందుకు పవన్ కళ్యాణ్ కు మరియు తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ నాయకత్వానికి జనసేన పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాయకుడు బైరపోగు సాంబశివుడు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు. ఈ సందరభంగా సాంబశివుడు మాట్లాడుతూ కొల్లాపూర్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి పార్టీ స్థాపించిన మొదటి నుంచి నా వంతుగా కృషి చేస్తూ పార్టీని ప్రజలకు, కార్యకర్తలకి, అభిమానులకి దగ్గర చేస్తూ నా వంతుగా కృషి చేస్తూ వెళుతున్నాను, తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కొన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు, ఈ సందర్భంగా తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈ దిశగా కసరత్తు మొదలు పెట్టింది, అందులో భాగంగానే కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో కీలక భూమిక పోసే విధంగా జనసేన పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండబోతుందని, కొల్లాపూర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ మరింత కీలకంగా మారే విధంగా జనసేన పార్టీ కార్యకర్తలని మరియు పవన్ కళ్యాణ్ గారి అభిమానులను, మెగా అభిమానులని ఏకం చేస్తూ ఏకతాటిపైకి తీసుకొచ్చే విధంగా పార్టీ నీ బలంగా ముందుకు తీసుకెళ్లే దిశగా నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి నేమురి శంకర్ గౌడ్ గారికి, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ బొంగునూరు మహేందర్ రెడ్డి గారికి, పీఏసీ సభ్యులు ఆర్హం ఖాన్ గారికి, నాగర్ కర్నూల్ జిల్లా నాయకులు శ్రీ వంగ లక్ష్మణ్ గౌడ్ అన్నగారికి, నాకు సహకరించిన కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క జన సైనికులకు, జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు సాంబశివుడు ఒక ప్రకటనలో తెలియజేశారు.