రోడ్డు వేస్తావా? రాజీనామా చేస్తావా? స్వామీ: డా. యుగంధర్

  • రోడ్ల దుస్థితిపై జనసేన వినూత్న నిరసన

గంగాధర నెల్లూరు నియోజకవర్గం: కార్వేటి నగరం మండలం, ఆర్ కే వి బి పేట పంచాయతీ, ఆర్కేవిబిపేట బందర్ రోడ్డు వీధిలో నిలబడి నీళ్లలో వరి నాట్లు కార్యక్రమం జనసేన ఆధ్వర్యంలో వినూత్నంగా నిర్వహించారు. ఈ సందర్బంగా యుగంధర్ మాట్లాడుతూ రోడ్డు వేస్తావా? రాజీనామా చేస్తావా? స్వామీ అని ఉప ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. రాజీనామా చేస్తే, జనసేన ఆధ్వర్యంలో రోడ్డు వేస్తామని, 15 రోజులు గడువు ఇస్తున్నామని ఆలోపు నీ సమర్థత నిరూపించుకోమని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అదేవిదంగా కె ఎం పురం పంచాయతీ, కె ఎం పురం గ్రామంలో వర్షానికి నిలిచిన నీళ్లలో మోకాళ్ళ మీద నిరసన కార్యక్రమం చేపట్టారు. పది రోజుల్లో సమస్య పరిష్కారం చూపకపోతే జనసేన ఆధ్వర్యంలో మహా ధర్నా చేస్తామని ఆగ్రహం వ్యక్తం చేసారు. కార్వేటి నగరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి వెంటనే క్షేత్రస్థాయి పర్యటన చేయాలని, డెంగ్యూ జ్వరంతో 18 నెలల పాప నిన్నటి రోజున మరణించిదని తల్లి దండ్రులు ఆవేదన వ్యక్తం చేసారు. ఆరు సంవత్సరాల నుండి ఇక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. నిలిచిన నీళ్లు పాములకు ఆవాసమైందని, ఇది అవసరమా స్వామీ అని,
నిన్ను గెలిపించింది ఇందుకేనా? అని ఉపముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని, గ్రామాలకు అండగా నిలవాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో కార్వేటినగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, మండల ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి, జనసైనికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.