ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి మద్దతునిచ్చిన ఎపిటిఎఫ్ అభ్యర్ధి పాకలపాటి రఘువర్మకి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి, అత్యధిక మెజార్టీతో ఆయన్ని గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొప్పుల వెలమ వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన జిల్లా సీనియర్ నాయకులు డా.రవికుమార్ మిడతాన కోరారు. ఉపాధ్యాయులను కలిసి, రఘువర్మ గెలుపుకు సహారించాలని కోరారు. విద్యారంగ అభివృద్దికి, ఉపాద్యాయ సమస్యల పరిష్కారానికి విశేష కృషి చేస్తున్న రఘువర్మ గారిని ఉపాద్యాయులంతా కలసి కట్టుగా మరోసారి శాసనమండలికి పంపించాలని కోరారు. ఉపాధ్యాయుల సంక్షేమమే తన ఏకైక లక్ష్యంగా ముందుకు సాగే రఘువర్మ వంటి నిస్వార్ధపరులు చట్టసభలలో ఉపాద్యాయుల గొంతు అవుతారని అన్నారు. కుల, మతాలకు అతీతంగా అందరికి ఆమోదయోగ్యులై, అందరివాడుగా మన్ననలు పొందిన పాకలపాటి రఘువర్మ గెలుపుకు ఉపాధ్యాయులు అందరు సహాయ, సహాకారాలు అందించాలని కోరారు. జనసేన పక్షాన పాకలపాటి రఘువర్మ ఎన్నికల ప్రచారంలో రవి కుమార్ తో పాటు జనసేన నాయకులు కలిదాసు, రమునాయడు మిడతన పోటిపిరెడ్డీ రమేష్, రయవరపు విజయరం తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment