పేరాబత్తుల రాజశేఖర్ ను గెలిపించండి

నర్సాపురం: కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను గెలిపించాలని కోరుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ప్రభుత్వ విప్ మరియు నర్సాపురం నియోజకవర్గ శాసన సభ్యులు బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ నర్సాపురం నియోజకవర్గం ఇంచార్జ్ పొత్తూరి రామరాజు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా గురువారం నరసాపురం నియోజకవర్గం, నర్సాపురం మండలంలోని రాజులంక, మరితిప్ప, దర్బరేవు, వేములిదేవి ఈస్ట్ మరియు వెస్ట్ బియ్యపు తిప్పలో పలుచోట్ల ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్స్ ని కలిసి, కరపత్రాలను పంపిణీ చేసి, మీ 1.వ ప్రాధాన్యత ఓటు పేరా బత్తుల రాజశేఖరంకు వేసి గెలిపించవలసిందిగా ఓటర్లను కోరి అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వాతడి ఉమా ఒడిగు ఏసుబాబు, ఉంగరాల నాగరాజు, అద్దాల శ్రీనివాస్, గన్నబతుల దుర్గాప్రసాద్, గ్రంధి నాని, దేవిరెడ్డి రామచంద్ర రావు, వడ్డీ ఆదినారాయణ, ఉంగరాల గిరి వాసు, ఉలిశెట్టిములస్వామి, దావిద్, ఉంగరాల నాగేశ్వరావు, గోపి జనసేన టిడిపి బిజెపి నాయకులు జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment