సంక్రాంతి సినిమాల విజేత..?

సంక్రాంతి పండుగ సందర్భంగా ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. కరోనా కారణంగా థియేటర్స్ లో సగం ఆక్యుపెన్సీ ఉన్నా కూడా నిర్మాతలు ధైర్యంతో సినిమాలను రిలీజ్ చేశారు. ఇప్పటికే సంక్రాంతి సినిమాలన్నీ థియేటర్స్ లో ఉన్నాయి. ప్రేక్షకుల ముందుకొచ్చి వాళ్ల ఫలితాన్ని కూడా అందుకున్నాయి. మరి ఈ నాలుగు సినిమాల టాక్ ఏంటి..? అందులో ఏది సేఫ్ జోన్ కు వచ్చింది.. ఏది ఇంకా డేంజర్ జోన్ లో ఉంది..? ఈ పండగ సినిమాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయి..? క్రాక్, మాస్టర్, రెడ్, అల్లుడు అదుర్స్ సినిమాలలో ఏది మంచి వసూళ్లు సాధిస్తున్నదో చూద్దాం!

క్రాక్: రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ చిత్రం జనవరి 9న విడుదలైంది. ఇప్పటి వరకు 6 రోజుల్లోనే 19 కోట్ల షేర్ వసూలు చేసింది. 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం 19 కోట్ల వరకు షేర్ తీసుకొచ్చింది ఇప్పటికే.

మాస్టర్: మానగరం, ఖైదీ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన మాస్టర్ జనవరి 13న విడుదలైంది. ఈ సినిమాకు 3 రోజుల్లో ఏపీ, తెలంగాణలో కలిపి 9.20 కోట్ల షేర్ వచ్చింది. 9 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం ఇప్పటికే లాభాల బాట పట్టింది. ఈ సంక్రాంతికి రవితేజతో పాటు విజయ్ కూడా విజేతగా నిలిచాడు.

రెడ్: ఇస్మార్ట్ శంకర్ సినిమా 38 కోట్లు షేర్ వసూలు చేసింది. అదే అంచనాలతో థియేటర్స్ లోకి వచ్చిన రెడ్ కూడా తొలిరోజు 6.7 కోట్ల షేర్ వచ్చింది. రెండో రోజు కూడా 3 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది రెడ్ చిత్రం. రెండ్రోజుల్లోనే 10 కోట్ల వరకు షేర్ వసూలు చేసి సత్తా చూపించాడు రామ్. అయితే రెడ్ సేఫ్ జోన్‌కు రావాలంటే 18 కోట్లు రావాలి.

అల్లుడు అదుర్స్: ఈ సంక్రాంతి సినిమాల్లో అందరికంటే వెనక ఉన్నది బెల్లంకొండ శ్రీనివాస్. సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించిన అల్లుడు అదుర్స్ తొలిరోజు 2.3 కోట్ల షేర్ వసూలు చేసింది. కానీ రెండో రోజుకు వసూళ్లు భారీగా పడిపోయాయి.