దర్శి నియోజకవర్గ ‘జనసేన పార్టీ ఇంటి ఆడపడుచు కానుక’ విజేతలు

సంక్రాంతి పండుగ సందర్భంగా దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి శ్రీ బొటుకు రమేష్ బాబు సహకారంతో కరోనా నిబంధనలను దృష్టిలో పెట్టుకొని వర్చ్యువల్ విధానంలో నిర్వహించిన ‘దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంటి ఆడపడుచు కానుక – ముగ్గుల పోటీల’ కు అనూహ్య స్పందన లభించినట్లు నిర్వాహకులు జనసేన పార్టీ – దర్శి వీరమహిళా నాయకురాళ్లు శ్రీమతి గుండ్ల భారతి, శ్రీమతి పాపిశెట్టి కోటేశ్వరమ్మ, కుమారి మల్లెల ప్రియాంక, మరియు దర్శి మండల కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి పుప్పాల భూలక్ష్మి తెలిపారు. భోగి పండుగ రోజున తమ ఇంటిముందు తామే స్వయంగా వేసి వాట్సాప్ ద్వారా తమకు ముగ్గులను పంపిన అనేకమంది ఆడపడుచుల నుండి దర్శి పట్టణ (1) సందువారిపాలెం నివాసి శ్రీమతి సంగు అనంత లక్ష్మి, (2) గాంధీనగర్ నివాసి శ్రీమతి చంద్రకళ, (3) సాయి నగర్ నివాసి శ్రీమతి పూలగంటి అంజమ్మ అను ముగ్గురిని ‘జనసేన ఇంటి ఆడపడుచు’ విజేతలుగా ఎంపిక చేసినట్లు శ్రీమతి గుండ్ల భారతి తెలిపారు. వచ్చిన ముగ్గులన్నీ ఎంతో గొప్పగా ఉన్నాయని, నియోజకవర్గ ఆడపడుచులు ఏ రంగంలోనైనా ఎవరికీ రెండోవారు కాదని, వారికి తగిన ప్రోత్సాహము ఇస్తే ఏ రంగంలోనైనా వారు ధీటుగా రాణిస్తారని, జనసేన పార్టీ మహిళలకు ఎంతో గౌరవము, ప్రోత్సాహము ఇస్తుందని, తమ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి శ్రీ బొటుకు రమేష్ బాబు, స్థానిక మహిళలు విద్యావంతులై అన్ని రంగాలలో రాణించాలని, స్వయం సమృద్ధి సాధించి వినుతికెక్కాలని కోరుకుంటారని, ఈ సందర్భంగా వారు అన్నారు. ఇంటి ఆడపడుచు పోటీలలోని ముగ్గురు విజేతలకు సంక్రాంతి పండుగ రోజున వారి ఇంటికి వెళ్లి ఒక్కొక్కరికి రూపాయలు 1,116/- విలువైన చీర-సారె కానుకగా అందించడం జరుగుతుందని వారు తెలిపారు. త్వరలో నియోజకవర్గ స్థాయిలో మహిళా సాధికారత సదస్సు కూడా ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు.