కూటమిని గెలిపించడం చారిత్రాత్మక అవసరం

  • కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి

తాడేపల్లిగూడెం: రాష్ట్రంలో కూటమిని అధికారుల్లోకి తీసుకురావడం చారిత్రాత్మక అవసరమని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. తాడేపల్లిగూడెం పాతూరులోని 10,12 వార్డుల్లో బొలిశెట్టి టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ వలవల బాబ్జి, బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ ఈతకోట తాతాజీలతో కలిసి ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రానికి రాజధాని లేకుండా ప్రజలను ఓట్ల కోసం పాములుగా వాడుకుంటున్న జగన్మోహన్ రెడ్డిని సాగనంపడం ప్రజల బాధ్యత అని ఆ కార్యక్రమానికి తాము ప్రతినిధులుగా మాత్రమే ఉంటున్నామని కూటమిని గెలిపించాల్సిన బాధ్యత ప్రజలదని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో ఒక పక్క అవినీతి, మరోపక్క అధికారులు అండతో కబ్జాలకు పాల్పడుతున్న కొట్టును తరిమికొట్టాలని లేదంటే ప్రజలకు భద్రత ఉండదని సూచించారు. రాష్ట్రంలో జగన్ లాండ్ గ్రాఫిక్ యాక్ట్ పేరుతో మన ఆస్తులను హస్త గతం చేసుకునేందుకు పన్నాగం పన్నుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వస్తే మన ఆస్తులపై జగన్ దోచుకునే ప్రమాదం ఉంటుందని వాటిపై కనీసం కోర్టు కూడా వెళ్లలేని విధంగా ఈ యాక్ట్ రూపొందించారని హెచ్చరించారు. ఎస్సీ సామాజిక వర్గం మద్దతుతో అందలమెక్కిన జగన్ ప్రస్తుతం వారికి రాజ్యాంగం కల్పించిన నిధులను, గత ప్రభుత్వాలు అందించిన పథకాలను అందించడంలో చిన్న చూపు చూశారన్నారు. రాష్ట్రంలో రామరాజ్యం రావాలంటే కూటమి అధికారం తోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.