306 పోలింగ్ కేంద్రాలతో.. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. ఇవాళ రాత్రికి 7 గంటలకు ప్రచారం ముగియనుంది. దీంతో పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారం ఆగిపోనుంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో 306 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 47 పోలింగ్ కేంద్రాల్లో వెయ్యి కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నారు. వయోవృద్ధులకు, దివ్యాంగులకు, కొవిడ్ రోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించనున్నారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 2,36,859 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో పురుష ఓటర్లు 1,17,768, మహిళ ఓటర్లు 1,19,090 మంది ఉన్నారు. ఎన్ఆర్ఐ ఓటర్లు 14 మంది ఉండగా, సర్వీస్ ఓటర్లు 149, పీడబ్ల్యు ఓటర్లు 8,246, ట్రాన్స్ జెండర్ ఒకరు ఉన్నారు. 18-19 ఏండ్ల ఓటర్లు 5,165 మంది ఉండగా, 80 ఆపై వయస్సున్న ఓటర్లు 4,454 మంది ఉన్నారు.