బాక్సింగ్ పంచ్‌తో.. వరుణ్ తేజ్ గని మోషన్ పోస్టర్..

వరుస విజయాలతో దూసుకెళుతున్న మెగా హీరో వరుణ్ తేజ్ ఈరోజు తన 31వపుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన నటిస్తోన్న తాజా చిత్రం నుంచి మోషన్ పోస్టర్, టైటిల్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఆ పోస్టర్‌లో వరుణ్ బాక్సింగ్ చేస్తూ ఎనర్జిటిక్ లుక్‌లో కేకపెట్టిస్తున్నాడు. ఇక ఈ చిత్రంపేరును గనిగా ఖారారు చేసారు దర్శకనిర్మాతలు. ఈ సినిమాతో బాక్సర్ పాత్రలో నటించనున్నాడు వరుణ్. గని సినిమాను కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం కోసం వరుణ్ ప్రత్యేకంగా బాక్సింగ్ శిక్షణ తీసుకున్నారు. ఈ సినిమా దాదాపు రూ.35 కోట్లతో భారీగా తెరకెక్కుతోంది. వరుణ్‌కు జోడిగా ప్రముఖ హిందీ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వరుస చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

ఇక వరుణ్ తేజ్ కెరీర్ విషయానికి వస్తే.. 2000లో ‘హ్యాండ్స్ అప్’ అనే సినిమాలో వరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించినా.. ఆయన అసలు కెరీర్ 2014లో వచ్చిన ‘ముకుంద’ సినిమాతో మొదలైంది.