మామకు ప్రేమతో: సమంత

అక్కినేని నాగార్జున పుట్టినరోజు వేడుకల హంగామా మొదలయ్యింది. తాజాగా మామగారైన  నాగార్జున కోసం కోడలు సమంతా ఓ స్పెషల్ ప్లాన్ చేసి.. ఆయన బర్త్ డే హంగామాను తన చేతుల మీదుగానే స్టార్ట్ చేసేసింది. ఆగష్టు 29న రానున్న నాగార్జున బర్త్ డే సందర్భంగా కామన్ డీపీ రిలీజ్ చేసి అక్కినేని ఫ్యాన్స్‌ని హుషారెత్తించింది సమంత.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో నాగార్జున కామన్ డీపీ పోస్ట్ చేసిన సామ్.. ”కింగ్ నాగార్జున బర్త్ డే డీపీ రిలీజ్ చేయడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. ఆయనపై నా ఎల్లవేళలా ప్రేమ, గౌరవం ఉంటుంది. అందరి గుండెల్లో ఎప్పుడూ ఆయన రాజే” అని పేర్కొంది సమంత. ఆమె విడుదల చేసిన ఈ డీపీలో నాగార్జున సినిమాల్లో అన్ని గెటప్స్ పొందుపరిచి అక్కినేని అభిమానులకు కిక్కిచ్చారు. దీంతో అశేష అభిమాన వర్గం ఈ డీపీని వైరల్ చేస్తూ తమ ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుంటున్నారు.