జనసేన పార్టీలో మహిళలకు ప్రాధాన్యత

*ప్రతి రంగంలో మహిళలు ప్రగతిని సాధిస్తున్నారు
*అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సామినేని ఉదయభాను

విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు గారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను హాజరయ్యారు. సామినేని ఉదయభాను మాట్లాడుతూ.. అన్ని రాజకీయ పార్టీల్లో మహిళా కార్యకర్తలు మాత్రమే ఉంటారని, కానీ జనసేన పార్టీలో వీర మహిళలు ఉన్నారని గర్వంగా ప్రకటించారు. జనసేన పార్టీలో వీర మహిళ విభాగాన్ని ఏర్పాటు చేసిన పార్టీ అధ్యక్షులు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహానికి మహిళా లోకం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. రాజకీయాల్లో 33% మహిళలకు అవకాశం కల్పించడం వంటి చర్యలు మహిళా సాధికారితకు దోహదం చేస్తున్నాయని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ప్రతి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించడం శుభపరిణామం అని అభిప్రాయపడ్డారు. ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు గారిని ప్రత్యేకంగా అభినందించారు. జనసేన పార్టీలోని వీర మహిళలకు అన్ని విధాలుగా పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. అనంతరం, సమాజంలో వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న ప్రముఖ మహిళలకు మరియు జనసేన వీర మహిళలకు ప్రత్యేక సత్కార సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, పారిశుద్ధ కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఏపీఐఐసీ డైరెక్టర్ మండలి రాజేష్, విజయవాడ జనసేన పార్టీ మహిళా కార్పొరేటర్లు ఉమ్మడిశెట్టి రాధిక, పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివపార్వతి, ఆత్తులూరి రాజ్యలక్ష్మి, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోతిరెడ్డి అనిత, కృష్ణ పెన్నా రీజియన్ కోఆర్డినేటర్ మల్లెపు విజయలక్ష్మి, వీరమహిళలు ఇతర ప్రముఖులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-03-08-at-8.55.36-PM-1 జనసేన పార్టీలో మహిళలకు ప్రాధాన్యత

Share this content:

Post Comment