మహిళా సాధికారత జనసేన టీడీపీ బీజేపీపార్టీలతోనే సాధ్యం

  • 43వ డివిజన్ లో కొనసాగిన మహిళలతో మాటామంతి కార్యక్రమం 51వ రోజు
  • జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత

అనంతపురం అర్బన్ నియోజకవర్గం: జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటామంతి కార్యక్రమంలో భాగంగా 51వ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని స్థానిక 43వ డివిజన్ లో పర్యటించి మహిళలతో మమేకమై స్థానిక సమస్యలు తెలుసుకొని జనసేన టీడీపీ బీజేపీపార్టీలకు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం మహిళల ఆర్థిక పురోగాభి వృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని వారి ఆర్థిక ఎదుగుదలకు ఏమాత్రం కృషి చేయకుండా రాష్ట్ర స్థూల ఆదాయం లో మహిళల వాటా ఏమాత్రం లేకుండా చేసారని దీనికి తోడు డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేసి వారి సాధికారతను దెబ్బతీసాడని జగనన్న పాలవెల్లువ వల్ల మహిళలకు ఓరిగింది ఏమి లేదని వైకాపా ప్రభుత్వం హయాంలో మహిళలపై దాడులు పెరిగాయాని కనుక మహిళలంతా ఈ విషయాలన్ని గ్రహించాలని ఉమ్మడి ప్రభుత్వ స్తాపంతోనే మహిళలకు సముచితమైన సాధికారత లభిస్తుందని వారి ఆర్థిక ఆత్మగౌరవం పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుంటారని అన్నారు. వీటితో ఉమ్మడి పార్టీల మేనిఫెస్టోలోని ముఖ్యంశాలను మహిళలకు వివరించారు. ఈ కార్యక్రమంలో వీరమహిళలు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.