మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి

అమలాపురం, దేశ ప్రగతికి మహిళల భాగస్వామ్యం చాలా ముఖ్యం అని మహిళా కళాశాలల కరెస్పాండెంట్ గణేశుల బ్రహ్మానందం అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, శ్రీ కృష్ణ దేవరాయ మహిళా జూనియర్ కళాశాల మరియు సర్ డాక్టర్ రావు బహదూర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు మహిళా డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న మహిళా అధ్యాపకులను, బోధనేతర సిబ్బందిని దుశాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ గంధం శ్రీరామ మూర్తి అధ్యక్షత వహించగా, కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ జగతా సురేష్, గణేశుల సతిష్, గుర్రం మహేష్, పితాని గోపాల కృష్ణ, కుసుమ నాగేంద్ర, పోలిశెట్టి ప్రసాద్, వంగా విశాల, ఆకుల దుర్గ, మోరంపూడి గీతాంజలి, దార్ల విజయ, పోలిశెట్టి మౌనిక తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment