నెల్లూరు: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు పేర్కొన్నారు. శనివారం, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మాగుంట లేఅవుట్ లో ఉన్న జనసేన నగర పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సుజయ్ బాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్, కోవూరు నియోజకవర్గ ఇన్చార్జ్ చప్పిడి శ్రీనివాసుల రెడ్డి, గూడూరు నియోజకవర్గ ఇన్చార్జ్ మోహన్ లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా, భారీ కేకును కట్ చేసి సంబరాలు జరిపారు. అనంతరం, ముఖ్య అతిథులు మహిళలను సన్మానించి వారికి చీరలు అందజేశారు. ఈ సందర్భంగా, సుజయ్ బాబు మాట్లాడుతూ, “నేటి సమాజంలో ఇప్పటికీ మహిళల పట్ల అసమానతలు, అణచివేత కొనసాగుతుంటే, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయాల్లో సరైన భాగస్వామ్యం అనేది తప్పనిసరి” అన్నారు. ఆయన మాట్లాడుతూ, “సమాజంలో ఒక మహిళను బలపరిచితే ఒక కుటుంబాన్ని బలపరుస్తుంది. ఒక కుటుంబం బలంగా ఉంటే అభివృద్ధి చెందుతుంది. ఈ నినాదంతో ముందుకు వెళ్ళినప్పుడే మన సమాజం ఆనందంగా ముందుకు వెళ్ళగలదు” అని అన్నారు. మహిళలను గౌరవించడం ఎంత అవసరమో వివరించిన సుజయ్ బాబు, “కుటుంబ పోషణ చూసుకుంటూ, కుటుంబ అవసరాలు తీర్చిన, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం, సిద్ధాంతాలను నమ్మి పార్టీ కోసం పనిచేస్తున్న వీరనారిలకు ఆయన ధన్యవాదాలు” అన్నారు. “మన జీవితాల్లో దిశా నిర్దేశం చూపించగలది ఒక్క మహిళలేనని” కూడా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళలు హైమా, హసీనా, మల్లికా, సందని మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment