అనంతపురం జనసేన మహిళా కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు

  • జనసేన పార్టీ మహిళా కార్యాలయం అనంతపురం నందు పలు సాంస్కృతిక కార్యక్రమాల నడుము ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
  • వైకాపా పాలనా కాలంలో మహిళలకు రక్షణ కరువు
  • జనసేన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ప్రత్యేక రక్షణ చట్టం

అనంతపురం: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ మహిళా కార్యాలయం అనంతపురం నందు రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలు ప్రారంభమై అనంతరం శ్రీలత పలువురు మహిళల నడుమ కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుకు రావాలని మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, సాంకేతికంగా పురోగాభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి వైపు పయణించే ఆస్కారం ఉందని అంటూ మహిళలపై వైకాపా ప్రభుత్వ హయాంలో దాడులు ఏటికేడు పెరిగిపోతూనే ఉన్నాయని మహిళలు రోడ్లమీద భయంతో తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని తిరిగి జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే మహిళలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువచ్చేందుకు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కృషి చేసి మహిళలకు అండగా నిలుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరమహిళలు, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.