గూడూరు ఘనంగా జనసేన పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు

గూడూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న మహిళలకు సత్కారం చేసినట్లు గూడూరు నియోజకవర్గ పీఓసి మోహన్ తెలిపారు. శనివారం జరిగిన ఈ వేడుకలో ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిందని, ప్రత్యేకంగా మహిళలకు అనేక చట్టాలు ఉన్నాయని గుర్తుచేశారు. సమాజంలో విద్య, వైద్యం, సేవా రంగాలలో మహిళలు మరింత ముందుకు రావాలని ఆహ్వానించారు. అలాగే, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించనున్నట్లు ప్రకటించారు. ఈ వేడుకలో నర్సు శ్రీమతి వెంకటేశ్వరమ్మ, పారిశుద్ధ్య కార్మికులు శ్రీమతి వెంకట రమణమ్మ, శ్రీమతి అంజలి, మరియు వీరమహిళ శ్రీమతి తులసీ లను ఘనంగా సత్కరించి, చీరలు అందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి వంశీ కృష్ణ, ఉప్పు సాయికిరణ్, జనసేన నాయకులు మధుసూధన్, శశికుమార్, వసంత్ సాయి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment