తాడేపల్లిగూడెం జనసేన ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

*స్త్రీ లేకపోతే జననం లేదు
*స్త్రీ లేకపోతే సృష్టి లేదు,
*స్త్రీ లేకపోతే గమనం లేదు,

తాడేపల్లిగూడెం, అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ అధ్యక్షులు నియోజకవర్గ కన్వీనర్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు జనసేన పట్టణ అధ్యక్షులు వర్తన పల్లి కాశి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభసందర్భంగా ఈరోజు ఏదైతే ప్రతిభావంతుల విద్యార్థులు ఉన్నారో వారిని సన్మానించి అభినందన జ్ఞాపికలు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో అడబాల నారాయణ మూర్తి, యంత్రపాటి రాజు, మద్దాల మనికుమర్, ముఖేష్, చాపల రమేష్, పుళ్ళ బాబీ, నాని, గుండుమోగుల సురేష్, వల్లూరి పల్లి దంగేటి మోహన్, అడపా జమున, వేజ్జు రత్న కుమారి, సోమలమ్మ పాల్గొన్నారు.