మహిళా సాధికారత జనసేనతోనే సాధ్యం: లోకం మాధవి

నెల్లిమర్ల నియోజకవర్గంలోని పూసపాటిరేగ మండలం, వెల్దురు గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా పనిచేస్తున్న స్త్రీలని శ్రీమతి లోకం మాధవి కలసి వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం అధోగతి పాలయ్యిందని, పేదవాడు పన్నుల భారంతో ఇబ్బందులు పడుతున్నారని. పేదవాడి సొంతింటి కల ఈ ప్రభుత్వంలో నెరవేరేలా కనిపించలేదని, పరిశ్రమలను తీసుకొని రాకుండా వైసీపీ ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తున్నారని పేదవాడి ఆదాయం పెంచే మార్గాలు వనరులు గురించి ఆలోచించకుండా వైసీపీ నాయకుల వ్యక్తిగత స్వలాభాల కోసమే ఆలోచించుకుంటూ పేద ప్రజలను ఇంకా అంధకారంలోకి నెట్టేస్తున్నారని మాధవి మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే అవినీతి జరగకుండా పారదర్శకంగా పాలన అంటే ఏంటో చేసి చూపిస్తామని మాధవి తెలిపారు. మాధవి మాటలకు ఎంతో ఆకర్షితులైన మహిళలు తమ మద్దతు ఈసారి తప్పక జనసేన పార్టీకి మరియు పవన్ కళ్యాణ్కి ఉంటుందని, ఒక మహిళగా మాధవి రాజకీయాల్లోకి రావడం ఎంతో హర్షినీయమని మహిళలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విజయనగరం జిల్లా నాయకులు లోకం ప్రసాద్, మత్స్యకార విభాగ కార్యదర్శి కారి అప్పలరాజు, మండలం నాయకులు జమ్మిరాజు రాజు, బాసి దుర్గ, గుడివాడ శేఖర్, సతీష్, బి నర్సింగరావు, రాలి రమణ, సుందరం, కె ఎల్లయ్య రెడ్డి, కే పోత్తయ్య రెడ్డి, కే రమణ, డి లక్ష్మణ, బి నర్సింగరావు, బి ఆదిరెడ్డి, బి వీరబాబు, కే నాని, బి ఎల్లయ్య, కే సాయి, టి శివాజీ, జి బంగార్రాజు, జి శ్రీను, నారాయుడు పాల్గొన్నారు.