కార్మికుల కన్నీళ్లు రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు: గాదె

*కార్మికుల పొట్టకొడితే వైసీపీ నేతలకు పుట్టగతులుండవు

*వైసీపీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీనే నెరవేర్చమంటున్నాం

*అసెంబ్లీ సాక్షిగా సాక్ష్యాత్తు సీఎం, మంత్రులు చెప్పిన మాటలు కూడా నీటిమూటలుగా మిగిలాయి

*రాష్ట్రంలో ఎక్కడి చెత్త అక్కడే ఉంది విషజ్వరాలు ప్రభలితే పరిస్థితి ఏమిటి?

*సమస్య పరిష్కారం అయ్యేవరకు కార్మికుల పక్షాన జనసేన పోరాడుతుంది

*జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షుడు నెరేళ్ల సురేష్

రక్తాన్ని చెమటగా మార్చి ప్రతినిధ్యం కష్టపడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వర్తించే కార్మికుల కన్నీళ్లు రాష్ట్రానికి ఏ మాత్రం శ్రేయస్సు కాదని.. జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. మున్సిపల్ యూనియన్ వర్కర్స్ ఐకాసా ఆధ్వర్యంలో జరుగుతున్న మూడవ రోజు సమ్మెలో జిల్లా జనసేన పార్టీ నేతలు పాల్గొని మద్దతు పలికారు. ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కార్మికులు అడుగుతున్నవి గొంతెమ్మ కోర్కెలు కాదని.. ఎండనకా, వాననకా తాము చేస్తున్న కష్టానికి ప్రతిఫలమేనన్నారు. సలహాదారుల పేరిట ఎందుకు పనికిరాని ఎంతోమందికి కూర్చోబెట్టి మేపుతూ కోట్లాది ప్రజాధనాన్ని వృధా చేస్తున్న ముఖ్యమంత్రికి కష్టాన్నే నమ్ముకున్న కార్మికులకు జీతాలు ఇవ్వటానికి మాత్రం చేతులు రావడంలేదని దుయ్యబట్టారు. సమ్మె చేస్తున్న వారిని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని ఇది మంచిపధ్ధతి కాదని, కార్మికులకు ఏదన్నా జరిగితే సహించేది లేదని గాదె వెంకటేశ్వరరావు హెచ్చరించారు. నగర అధ్యక్షుడు నెరేళ్ల సురేష్ మాట్లాడుతూ కోడి కూయకముందే సూర్యుడు రాకముందే విధుల్లో చేరి రోడ్లపై పేరుకున్న చెత్తా చేదారాన్ని, మాలమూత్రాలను తొలగించే పారిశుద్ధ్య కార్మికుల పొట్టకొడితే వైసీపీ నేతలు పుట్టగతులుండవని విమర్శించారు. కార్మికుల సంక్షేమం కోసం అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు సైతం నీటిమూటలుగా మిగిలటం సిగ్గుచేటన్నారు. ఒకవైపు ఎక్కడి చెత్త అక్కడే ఉందని మరోవైపు వర్షాలు పడుతుండటంతో పారిశుధ్యం క్షీణీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు కార్మికుల పక్షాన జనసేన పోరాడుతుందని నెరేళ్ల సురేష్ అన్నారు. రాష్ట్ర ఐకాసా నాయకులు సోమి శంకరరావు, రెల్లి యువజన నేత సోమి ఉదయ్, జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, కార్పొరేటర్లు యర్రంశెట్టి పద్మావతి, దాసరి లక్ష్మీ దుర్గ, జిల్లా ఉపాధ్యక్షుడు అడపా మాణిక్యాలరావు, ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్, నగర ఉపాడక్ష్యులు చింతా రాజు, నగర ప్రధాన కార్యదర్శిలు విజయలక్ష్మి, సుధా నాగరాజు, బండారు రవీంద్ర, యడ్ల మల్లి, బుడంపాడు కోటి, మల్లేశ్వరి, ఆసియా, మాధవి, యడ్ల రాధిక, నవీన్, జే బీ వై నాయుడు, శేషు, సుంకే శ్రీనివాసరావు , త్రిపుర , పులిగడ్డ గోపి , శీలం మోహన్ , సతీష్ తదితరులు పాల్గొన్నారు.