ప్రపంచ మెకానిక్స్ డే వేడుకలు

*సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన బొమ్మిడి నాయకర్

ప్రపంచ మెకానిక్స్ డే సందర్భంగా నరసాపురం జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్‌, నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెకానిక్ సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన, టూ వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (నరసాపురం & మొగల్తూరు) సభ్యుల నుండి వచ్చిన పలు సమస్యలను సమీక్షించారు. మోటారు మెకానిక్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు. మెకానిక్స్ జీవన విధానాన్ని గౌరవిస్తూ నిర్వహించిన ఈ వేడుకలు సమాఖ్యలో ఉత్సాహాన్ని నింపాయి.

Share this content:

Post Comment