యోగాంధ్రతో ప్రపంచ రికార్డు

*యోగ ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి
*యోగ దినోత్సవం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
*11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జయప్రదం చేద్దాం
*ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు పిలుపు

యోగతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు అన్నారు.. ఈ సందర్భంగా ఏలూరులో ఉన్న ఆర్టీసీ జోనల్ చైర్మన్ వారి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని తమ కార్యాలయంలో రెడ్డి అప్పల నాయుడు యోగా విశిష్టత గురించి మాట్లాడారు. ప్రతి నిత్యం తెల్లవారుజామునే నిద్ర లేచి, కనీసం మన జీవితం కోసం, మనం ఒక గంట కేటాయించాలని, మనకి దగ్గరలో ఈరోజు చాలామంది యోగ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారని, అక్కడికి వెళ్లి మంచి మంచి యోగ ఆసనాలు, ప్రాణాయామాలు, సాత్వికాహారం ఎలా తీసుకోవాలి వారి దగ్గర శిక్షణ పొందడం అవసరమని చెప్పారు.. మనం తీసుకునే శ్వాసని నియంత్రణ చేసి ప్రశాంతంగా ఉండగలిగిన నాడు మన ఆయుర్దాయం మరింత పెరుగుతుందని, హిమాలయాల్లో ఉన్న మహావతార బాబాజీ 5000 సంవత్సరాల వయస్సుతో నేటికీ జీవించి ఉన్నారని, ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ వారి శిష్యులేనని, అటువంటి హిమాలయ యోగులు టిబిటన్ పరిసర ప్రాంతాల్లో, ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం అయిన కాశీలో వందల సంవత్సరాలు వయసు ఉన్న యోగులు తిరుగుతూ ఉంటారని, యోగా చేయడం వల్ల మనలో క్రమశిక్షణ ఏర్పడుతుందని, ఎదుటి వ్యక్తితో ఎలాగ సంభాషించాలో ముందే మనకు తెలుస్తుందని, మన జీవన శైలిలో గొప్ప మార్పు వస్తుందని, కేవలం తెల్లవారుజామున బ్రాహ్మీమయ ముహూర్తంలో లేచి యోగా చేయడం వల్ల ఇన్ని మార్పులు ఉంటాయని, మన అఖండ భారతావనిలో పతంజలి మహర్షి యోగ సూత్రాలను అద్భుతంగా చెప్పారని, అలాగే యోగ పురుషుడు శ్రీకృష్ణ భగవానుడు కూడా యోగం గురించి అద్భుతమైనటువంటి వివరణలు ఇచ్చారని, మనం తెలుసుకున్నది చాలా తక్కువ తెలుసుకోవలసినది ఎంతో ఉన్నదని ప్రతి ఒక్కరూ యోగ విద్యని అభ్యసించి ఆరోగ్యవంతులై ఆనందంగా జీవించాలని, శనివారం జరిగే ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు, నిత్యం యోగా చేస్తూ భారతదేశానికి ఒక రోల్ మోడల్ గా నిలిచిన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, ఇతర దేశాల ప్రతినిధులు రేపు జరిగే విశాఖపట్నంలోని యోగా డేలో ఐదు లక్షల మందితో పాల్గొంటున్నారని, ఏలూరు పరిసర ప్రాంత ప్రజలు మీకు దగ్గరలో జరిగే ఈ యోగా డే వేడుకల్లో పాల్గొనాలని ఆయన కోరారు. 11 వ యోగా డే నీ విశాఖపట్నంలో నిర్వహించడం మన అదృష్టం అని, ఈ సందర్భంగా యోగాని చేద్దాం – ఆనందకర జీవితాన్ని సాగిద్దాం అని రెడ్డి అప్పలనాయుడు పిలుపు నిచ్చారు. అలాగే యోగ ప్రతి ఒక్కరీ దైనందిక జీవితంలో భాగం కావాలని ఆయన ఆకాంక్షించారు.

Share this content:

Post Comment