మట్టి వినాయకుణ్ణి పూజించండి పర్యావరణాన్ని కాపాడండి: వాసా శ్రీనివాసరావు

మంగళగిరి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా మొదటి రోజు మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమం మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు మాట్లాడుతూ జనసేన సిద్ధాంతాలలో ఒకటైన పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా మట్టి గణపతి ప్రతిమలు పంపిణీ చేస్తున్నామని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న జనసేన యర్రబాలెం కమిటీకి అభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.