జగన్మోహిని అవతారంలో యాదాద్రి లక్ష్మీనారసింహుడు

యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం స్వామివారికి జగన్మోహిని అలంకార సేవ నిర్వహించారు. ఇవాళ రాత్రి లక్ష్మీనరసింహ స్వామికి అశ్వవాహన సేవ నిర్వహిస్తారు. నేటి నుంచి విశేష ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఇవాళ రాత్రి బాలాలయంలో ఎదుర్కోలు ఉత్సవం జరుగనుంది. రేపు యాదగిరీశుడి తిరు కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. ఈ నెల 23న సాయంత్రం 7 నుంచి 7:30 గంటల వరకు స్వామివారి బాలాలయంలో, రాత్రి 8 గంటల నుంచి కొండ కింద వైకుంఠద్వారం నుంచి దేవస్థాన ప్రచార రథం ఊరేగిస్తారు. 25న ఉదయం స్వామివారి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9 గంటలకు స్వామివారి శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ నెల 22 జరిగే కల్యాణోత్సవానికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హాజరుకానున్నారు.