పలుకుటుంబాలకు మనోధైర్యాన్నిచ్చిన యడ్లపల్లి రామ్ సుధీర్

• జనసైనికుడు ఈదా దిలీప్ కు రూపాయలు 10 వేల ఆర్ధికసాయం
• ఇటీవల పురుగుమందు పిచికారి చేస్తూ పొలంలో పడి ఈదా దిలీప్ హఠాన్మరణం
• చేనేత కుటుంబానికి రూపాయలు 5 వేలు ఆర్ధికసాయం

కృష్ణా జిల్లా, పెడన నియోజకవర్గం, బంటుమిల్లి మండలం ఆముదాలపల్లి గ్రామానికి చెందిన జనసైనికుడు ఈదా దిలీప్ వ్యవసాయ పనులు చేస్తూ ఉంటారు. సెప్టెంబర్ 17 వ తారీకున పొలంలో పురుగుమందులు పిచికారీ చేసేందుకు వెళ్ళారు, పిచికారీ చేస్తూ ఉండగానే పొలంలో స్పృహతప్పి పడిపోయారు. హాస్పిటల్ కు తరలించే మార్గంలో మృతిచెందారు. స్థానిక జనసేన కార్యకర్తల ద్వారా విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ శనివారం ఆముదాలపల్లి గ్రామంలోని ఈదా దిలీప్ ఇంటికి వెళ్లి అతని కుటుంబాన్ని పరామర్శించారు. జనసేన పార్టీ తరఫున రూ. 10 వేల ఆర్ధిక సాయాన్ని అందచేశారు. ఈదా దిలీప్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆ కుటుంబానికి ఎలాంటి అవసరం ఉన్నా సమాచారం ఇవ్వాలని స్థానిక జనసేన శ్రేణులకు సూచించారు. అనంతరం పెడన పట్టణం 22 వ వార్డు రామలక్ష్మి వీవర్స్ కాలనీలో నివాసం ఉంటున్న పులి. విమల గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ 23వ తేదీ శుక్రవారం కాలం చేశారు. భర్త పేరు పులి. శివకుమార్ వృత్తి చేనేత ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న జనసేన నేత యడ్లపల్లి రామ్ సుధీర్ శనివారం ఆ కుటుంబాన్ని పరామర్శించి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో బంటుమిల్లి మండల అధ్యక్షులు ర్యాలీ సత్యనారాయణ, ఉపాధ్యక్షులు గోట్రు రవి కిరణ్, కార్యదర్శి మారుబోయెన సుబ్రమణ్యం, ప్రధాన కార్యదర్శి బత్తుల సాంబశివ రావు, వల్లారపు వెంకటేష్ (బాబీ), చిటికినేని రవితేజ, జనసేన నాయకులు దివి శ్రీనివాస్, పోలగాని లక్ష్మీ నారాయణ, కొప్పినీటి శివమణి, ఎం. అశోక్ కుమార్, కొఠారి మల్లిబాబు, నందం శివ, బాకీ నాని, వినోద్, పవన్ స్థానికులు చోటి, మెడక కిషోర్ పాల్గొన్నారు.