యల్లటూరు శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో జనసేన యస్.సి సెల్ కార్యవర్గ సమావేశం

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట పట్టణం జనసేన పార్టీ కార్యాలయం (యల్లటూరు భవన్) నందు రాజంపేట జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీ యస్.సి సెల్ కమిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో భాగంగా యస్.సి యువ నాయకులతో సమావేశమైనారు. ఈ సమావేశంలో దళితవాడల అభివృద్ధిపై చర్చ మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలపై ప్రతి కాలనీలో అవగాహన కల్పించేందుకు కార్యాచరణ రూపొందించారు. ఈ సందర్భంగా యువకులు యల్లటూరు శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నంద్యాల హరి, పులి నరసింహ, రాహుల్, రమేష్, సిద్దయ్య, కె.సాయి, పి.సాయికృష్ణ, పి.శివరామ్, దుర్గ, అజయ్, నందకుమార్, లక్ష్మయ్య, సుదీర్, బాబు మరియు జనసేన నాయకులు గురివిగారి వాసు తదితరులు పాల్గొన్నారు.