పల్లంశెట్టి రామసుబ్బమ్మకు ఘననివాళులు తెలియజేసిన యల్లటూరు

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట పట్టణం, టి.అగ్రహారంలో ఉన్న కీ.శే.పల్లంశెట్టి కృష్ణయ్య(ఫారెష్ట్ ఆఫీసర్) సతీమణి పల్లంశెట్టి రామసుబ్బమ్మ అకాలమరణ వార్త విన్న రాజంపేట జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు ఘన నివాళులు తెలియజేశారు. బుధవారం వారి తమ్ముడు మాజీ జడ్పీటీసి యల్లటూరు శివరామరాజు వారి స్వగృహంలో మృతదేహానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజంపేట జనసేన నాయకులు శింగంశెట్టి నరేంద్ర, నాసర్ ఖాన్, భీమినేని రమేష్, తోట సురేష్, మౌల, పత్తి నారాయణ, చిట్టే బాస్కర్, సాయి రాజు తదితరులు పాల్గొన్నారు.