బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతికి యల్లటూరు ఘన నివాళులు

రాజంపేట జనసేన పార్టీ నాయకులు యల్లటూరు శ్రీనివాస రాజు

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం: ఊటుకూరు పంచాయతి కోండ్లోపల్లె హరిజనవాడ గ్రామంలో జనసేన పార్టీ నాయకులు నంద్యాల హరి మరియు గ్రామ ప్రజల ఆద్వర్యంలో బాబాసాహెబ్ డా.బి.ఆర్.అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామస్థుల ఆహ్వానం మేరకు రాజంపేట జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు గారు ముఖ్య అతిథిగా పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాజంపేట పట్టణం ఆర్ అండ్ బి బంగ్లా దగ్గర వున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జనసేన పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయంతి కార్యక్రమం గ్రామస్థుల మద్య జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు వచ్చే ఏడాది ఈ గ్రామంలో విగ్రహం ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారు. నిరక్షరాస్యత, కటిక పేదరికంతో, ఆకలితో అలమటిస్తున్న అభాగ్యులెందరో గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా అంధకారంలోనే జీవిస్తున్నారని వారిని ఆ చీకటి నుండి విముక్తి చేయవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. దేశంలోని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు, భారత రాజ్యాంగ రూపకర్త, భారత తొలి న్యాయ శాఖ మంత్రి భారతరత్న బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రాజంపేట జనసేన పార్టీ తరఫున ఘననివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వెలగచర్ల గణేష్, మళ్ళి, అవైరు, ఏనుగుల మల్లి, ముత్యాల చలపతి, మన్నేరు సూరిబాబు, నామాల శంకరయ్య, పూల నరసింహులు, చోడరాపు రమేష్, అంద్యాల హరి, నంద్యాల నరసింహులు, నంద్యాల సుబ్రమణ్యం, నంద్యాల పెంచలయ్య, నంద్యాల ఉమాకాంత్, సాయి కోడూరు, అర్జున్, సాయికృష్ణ, నంద్యాల నంద, కోలాటం హరికృష్ణ, ప్రశాంత్ భారతాల, పూల మురళి, గాజుల మల్లికార్జున, ముత్యాల చలపతి, మాజీ జెడ్పీటీసి యల్లటూరు శివరామరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, నాసర్ ఖాన్, పత్తి నారాయణ, నారదాసు రామచంద్ర, క్రిష్ణయ్య, మౌల, రాజా ఆచారి, శెట్టం రవి తదితరులు పాల్గొన్నారు.