వైసిపి ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలి: పోలీరెడ్డి డిమాండ్

  • నిడదవోలు జనసేన ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ :

నిడదవోలు: నిడదవోలు మండల అధ్యక్షులు పోలీరెడ్డి వెంకటరత్నం ఆధ్వర్యంలో
గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ మరియు రాష్ట్రములో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్యానర్లు తొలగించాలని డిమాండ్ చేశారు.. పోలీరెడ్డి వెంకటరత్నం మాట్లాడుతూ.. రాక్షస పాలనకి అంతం, ప్రజా పాలనకి ఆరంభం అవుతుందని, నియంతలతో యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైనది అని, పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అనే పేరుతో రాష్ట్రంలో అనేక చోట్ల చిత్రీకరించిన బ్యానర్లను వైయస్సార్సీపి నాయకులు కట్టిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించని పక్షంలో వైసీపీకి వ్యతిరేకంగా జనసేన తరఫున మేము కూడా ఫ్లెక్సీలు ఎర్పాటు చేస్తామని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో పోలీరెడ్డి వెంకటరత్నం, జనసేన ఎంపీటీసీ, మండలం ఉపాధ్యక్షులు వాకా ఇంద్ర గౌడ్, ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు యడ్లపల్లి సత్తిబాబు, కస్తూరి వెంకట సుబ్బారావు, కట్రేడ్డి పవన్ పాల్గొన్నారు.