బాధిత కుటుంబాలకు భరోసా కల్పించాల్సిన వైసీపీ విఫలం అయింది: సీ.హెచ్ అనిల్ కుమార్

తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ రూరల్: మహిళల రక్షణ గురించి అధికార వైసీపీ పార్టీ పట్టించుకోకుండా దిశ చట్టం తీసుకొని వచ్చాము అని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకని స్పందించడం లేదు అని జనసేన పార్టీ తరుపున మేము తీవ్రంగా ఖండిస్తున్నామని కాకినాడ రూరల్ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు సీ.హెచ్ అనిల్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ.. కామాంధుడుకి మహిళలు బలి అయిపోతున్నా ఏదో ఉద్దరించేసినట్టు వ్యవహరించడం సబబు కాదు, బాధిత కుటుంబాలకు భరోసా కల్పించాల్సిన వైసీపీ ప్రభుత్వం విఫలం అయింది అని అర్థం అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ప్రతి రోజు అత్యాచారాలు, మాహిళలపై అఘాయిత్యానికి పాల్పడిన వారిపై ఎందుకని సరైన శిక్ష విధించడం లేదు. మీ వైసీపీ పార్టీ మహిళా నాయకురాలు రేపల్లె లో అత్యాచారంకి గురి అయిన మహిళ పై అనుకోని రీతిలోలో అప్పటికి అప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి.. అని చెప్పడం సబబు కాదు. బాధ్యత కలిగిన వ్యక్తి.. ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు తల్లిదండ్రుల పెంపకాన్ని తప్పు బట్టేలా మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తునం. తక్షణమే బాధిత కుటుంబాలకు భరోసా కల్పించని పక్షాన ముఖ్యమంత్రి సమీక్ష పెట్టి అఘాయిత్యాలకు పాల్పడిన నిండుతుడికి కఠినంగా శిక్ష విధించి.. అభం శుభం తెలియని చిన్నారులకు, మహిళలకు రక్షణ కల్పించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ప్రజల పక్షాన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అదేశాలు మేరకు ప్రతి జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ వీరమహిళలు, జనసైనికులు ప్రతి ఒక్కరు కూడా గౌరవ హై కోర్టును, సివిల్ కోర్టుని ఆశ్రయించి బాధితులకు అండగా ఉంటామని తెలియజేస్తూ.. జిల్లాకలెక్టర్ గారిని ఆశ్రయించి ప్రతి ఒక్కరు కూడా.. వినతిపత్రం సమర్పిస్తాం అని మరొక సారి జనసేన పార్టీ తరుపున హెచ్చరింస్తున్నామని. వైసీపీ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని అనిల్ కుమార్ డిమాండ్ చేశారు.