వైసిపి ప్రభుత్వం రైతులను త్వరగా ఆదుకోవాలి: గాదె

ఫొన్నూరు: ఉమ్మడి గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు,పొన్నూరు మండలంలో ఉన్న మంచాల, బ్రాహ్మణ కోడూరు వెల్లలూరు గ్రామాలలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంట పొలాలను గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు పరిశీలించారు.

  • ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పొలాలు మునిగి 3 రోజులు అవుతున్నా ప్రభుత్వం నుండి ఏ మాత్రం స్పందన లేకపోవడం ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న నిర్లక్ష్యంను తెలియచేస్తుంది అన్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మానస పుత్రికగా చెప్పుకునే రైతు భరోసా కేంద్రాలు కేవలం పేపర్ లలో యాడ్స్ ఇచ్చుకోవడానికి మాత్రమే ఉన్నాయి అని, రైతు భరోసా కేంద్రాలలో కన్నా బయట విత్తనాల రేట్లు తక్కువగా ఉన్నాయి అని ఎద్దేవా చేసారు.
  • అలాగే రైతులకు తక్షణ సాయం చేయని పక్షంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతుల పక్షాన నిరసన కార్యక్రమాలు చేపడతాం అని తెలియచేసారు.
  • ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, జిల్లా కార్యదర్శులు నారదాసు ప్రసాద్, తాళ్లూరి అప్పారావు, మేకల రామయ్య యాదవ్, దేశంశెట్టి సూర్య, నెల్లూరు రాజేష్, సాయి, చేబ్రోలు మండల అధ్యక్షుడు చందు శ్రీ రాములు, పొన్నూరు మండల అధ్యక్షుడు నాగిశెట్టి సుబ్బారావు, పొన్నూరు టౌన్ అధ్యక్షుడు షేక్ కరిముల్లా, నాగిశెట్టి కృష్ణయ్య, చందు శివ కోటేశ్వరరావు, సుధా వసంత్, చంద్ర తేజ మరియు జన సైనికులు స్థానిక రైతులు పాల్గొన్నారు.