జయహో బీసీ సభ జరిపే హక్కు వైసీపీకి లేదు: మరీదు శివరామకృష్ణ

నూజివీడు: బీసీలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది వైసీపీ ప్రభుత్వం. డిసెంబర్ 8న చేపట్టాలనుకున్న బీసీల ఆత్మీయ సదస్సు ఒక రోజుముందే నిర్వహించాలని నిర్ణయించుకుంది. డిసెంబర్ 7న తేదీన భారీ ఎత్తున విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో సమావేశం నిర్వహించనుంది. డిసెంబర్ 7న నిర్వహించనున్న ఈ సభకు వైసీపీ జయహో బీసీ మహాసభగా నామకరణం చేసింది. ఈ సభ నిర్వహణపై స్పందించిన జనసేన ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ పలు ప్రశ్నలను సందించారు. జయహో బీసీ సభ జరిపే హక్కు వైసీపీకి లేదని ఆయన మాట్లాడుతూ..
*బీసీ మహాసభ కాదు ఇది – ఆత్మవంచన సభ
*బీసీలను మోసం చేస్తు 7 న జయహో బీసీ మహాసభ జరపడం బీసీ లని మళ్ళీ మోసం చేయడానికే..
*బీసీ మంత్రులు వీటికి సమాధానం చెప్పాలి
*కృష్ణయ్య పదవి కోసం బిసి ల జాతులను తాకట్టు పెట్టారు
*జగన్మోహన్ రెడ్డి లు బీసీలకు అన్యాయం చేసినా మీకు కనిపించ లేదా
*మీ పదవి కోసం బీసీల హక్కులను తాకట్టు పెడతారా
*సీబీఐ దత్త పుత్రుడు జగన్మోహన్ రెడ్డి కోసం మా భవిష్యత్తు ను కాలరాస్తారా
*బీసీ ప్రజలందరికీ కృష్ణయ్య సమాధానం చెప్పాలి
*రిజర్వేషన్ కుదించడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలు పోటీ చేసే అర్హత కోల్పోయారు
*మీరు బీసీల కు నేతగా ఉన్నారా.. జగన్మోహన్ రెడ్డి కి దళారిగా మారారా
*బీసీలకు జరుగుతున్న అన్యాయం పై జగన్మోహన్ రెడ్డి ని ఎందుకు నిలదీయడం లేదు
*రాజ్యసభ సీటు కోసం బీసీల ద్రోహి జగన్ కు మద్దతు ఇస్తారా
*మీ చర్యల వల్ల బిసి సంక్షేమ సంఘం సిద్దాంతం పక్కదారి పట్టించి
*బీసీల నాయకుడిగా ఉన్న కృష్ణయ్య.. బిసిల ప్రయోజనాల ను కాలరాశారు
*జగన్మోహన్ రెడ్డి బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుతున్నారు
*కృష్ణయ్య చేసే కుటిల యత్నాలు ను బీసీలంతా తిప్పి కొట్టాలి
*జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఏమి న్యాయం చేశారో చెప్పాలి
*సామాజిక న్యాయం చేయకపోగా…సామాజిక మోసం చేశారు
*జగన్ ప్రభుత్వంలో బీసీ సబ్ ప్లాన్ ను తప్పుదోవ పట్టించారు
*బీసీల కోసం కేటాయించిన నిధులు నవరత్నాలకు మళ్లించారు
*ఇన్ని చేసినా… జగన్ ను ఎందుకు ప్రశ్నించలేదో కృష్ణయ్య చెప్పాలి..?
*నామినేటెడ్ పోస్ట్ లు, టిడిపి పాలకవర్గం, సలహాదారులు, వీసిల నియామకంలో బీసీలకు అన్యాయం చేయలేదా
*14బీసీల కార్పొరేషన్ లను 56 బీసీ కార్పొరేషన్ లు చేశారు
*ఈ కార్పొరేషన్ లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు
*కేవలం ప్రచారం కోసమే జగన్ బీసీలను వాడుకున్నారు
*139బీసీ కులాలను జగన్ మోసం చేస్తే.. మీరెందుకు ప్రశ్నించడం లేదు
*కులచేతి వృత్తుల వారికి పనిముట్లు ఇవ్వకుండా మోసగించ లేదా
*బీసీల ముసుగు వేసుకుని జగన్మోహన్ రెడ్డి కి గులాం గిరీ చేస్తున్నారా
*వీటన్నింటికీ సమాధానం చెప్పాక.. వైసిపి మంత్రులు కు సన్మానం చేయండి
*బీసీ నాయకుడిగా ఎదిగిన కృష్ణయ్య .. బిసి ల కు జరిగే అన్యాయం పై మాట్లాడరా
*మీరు పదవుల కోసం… బీసీల ద్రోహి గా మారిపోయారా
*జగన్మోహన్ రెడ్డి బీసీలకు చేసిన మోసాలు పై ముందు సమాధానం చెప్పాలి
*బీసీ అంటే బ్యాక్ బోన్ అంటూ జగన్ ప్రచారం బాగా చేసుకున్నారు..
*నేటికీ బ్యాక్ వర్డ్ క్యాస్ట్ గానే జగన్ చూస్తూ… మోసం చేస్తూ ఉన్నారు
*ఆర్.కృష్ణయ్య ముందు బీసీ లకు క్షమాపణ చెప్పాలి
*మాలాంటి బీసీలను చట్ట సభల్లో స్థానం కల్పించాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారు..
*34శాతం రిజర్వేషన్ బిసిలకు అమలు చేయాలని మా అధినేత న్యాయ పోరాటం చేశారు..
*బీసీలంతా వాస్తవాలు తెలుసుకుని పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇవ్వండి
*కృష్ణయ్య నిజంగా బీసీల దళపతి అయితే .. కేసిఆర్, జగన్మోహన్ రెడ్డి లను నిలదీయాలి
*మీ తెల్లని కాగితం పై నల్లని చుక్కలు అంటించవద్దు
*విజయవాడ లో త్వరలో బిసి గర్జన పెట్టి.. పవన్ కళ్యాణ్ ని ఆహ్వానిస్తాం
*ఆర్.కృష్ణయ్య కి చిత్తశుద్ది ఉంటే బీసీలకు చేసిన అన్యాయం పై జగన్ ను నిలదీయాలి
*జగన్మోహన్ రెడ్డి.. బీసీలకు ఏమేమి మేలు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలి
*బీసీలంతా ఏకమై… జగన్ కి బుద్ధి చెప్పడానికి ముందుకు రావాలని .. శివరామకృష్ణ కోరారు.