అయోమయంలో వైసీపీ..!

*ప్రజల్లో మాయ మాటలు నడవవు
*జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి చొప్పా చంద్రశేఖర్

సింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో జరిగిన వైఎస్సార్సీపీ సమావేశం ద్వారా ఆ పార్టీ నాయకత్వం తమ అయోమయ స్థితిని మరోసారి బయటపెట్టుకుందన్న అభిప్రాయాన్ని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి చొప్పా చంద్రశేఖర్ వ్యక్తం చేశారు. గత ఎన్నికల వరకు వైసీపీని దూషించిన శైలజనాథ్‌, ఇప్పుడు అదే పార్టీ కార్యాలయం ప్రారంభించడం ప్రజలను మభ్యపెట్టే నాటకమేనని విమర్శించారు. ఓటమిని జీర్ణించుకోలేని వైసీపీ నేతలు ఈవీఎంలపై ఆరోపణలు చేయడమే వారి రాజకీయ పరాజయానికి నిదర్శనమని పేర్కొన్నారు. గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ పాలనలో జరిగిన అవినీతి, కార్యకర్తల పట్ల నిర్లక్ష్యం, సామాజిక న్యాయం పేరుతో జరిగిన దోపిడీకి ప్రజలే గట్టి సమాధానం ఇచ్చారని చెప్పారు. ముఖ్యంగా సింగనమల నియోజకవర్గంలో ప్రజాధనాన్ని దోచుకుని కుటుంబ పాలన సాగించిన జొన్నలగడ్డ పద్మావతి, సాంబశివారెడ్డి, ట్రిప్పర్ రామాంజిలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘మీరు అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకోకుండా, ఇప్పుడు మీటింగ్‌కి రమ్మని బ్రతిమాలుతున్న తీరు బాధ్యతలేని నాయకత్వానికి నిదర్శనం’’ అన్నారు. వైసీపీ నేతల అవినీతి చర్యల వల్ల కార్యకర్తలు తెల్లచొక్కాలో బిక్కుబిక్కుమంటూ మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. అంతేకాదు, “మీరు చూడలేకపోతే మేమున్నాం – మేము నేత్రదానం చేస్తాం” అంటూ మహిళా నేతలు పవన్ కళ్యాణ్‌ గారిని చూడలేకపోవడం వెనుక ఉన్న మూఢనమ్మకాలను ఎండగట్టారు. అనంతపురం ప్రజలు గతంలో ఇచ్చిన అవకాశాన్ని ఎలా వాడుకున్నారో చూసి వైసీపీని పూర్తిగా తిరస్కరించారని గుర్తు చేశారు. చివరగా, “ప్రజలే నిజమైన తీర్పుదారులు. మిమ్మల్ని వారు ఎంతగా నమ్మారో ఇటీవల జరిగిన ఎన్నికలు స్పష్టంగా చూపించాయి. ఇకముందు మిమ్మల్ని నమ్మే రోజులు దాటి పోయాయి,” అంటూ సింగనమల నియోజకవర్గ ప్రజల భావాలను జనసేన తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ చొప్పా చంద్రశేఖర్ స్పష్టం చేశారు.

Share this content:

Post Comment