వైసిపి నేతలు రాజకీయ నాయకులు కాదు: గాదె

గుంటూరు లాడ్జి సెంటర్లో గల జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి మాట్లాడిన విధానం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఉందని తీవ్రంగా విమర్శించారు. గతంలో పోలీసుల పట్ల వైసిపి నేతలు ప్రవర్తించిన తీరు ప్రజలందరికీ తెలుసు అని, ఇప్పుడు అదే పోలీసు శాఖను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనమని అన్నారు. రాష్ట్రానికి కనీస అవగాహనలేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్ర ప్రజల దురదృష్టమని అన్నారు. ప్రజలు గత ఎన్నికల్లో ఆయన స్థాయిని గుర్తించినా, వైసిపి నాయకుల తీరు ఇప్పటికీ మారలేదని విమర్శించారు. వైసిపి నాయకులు రాజకీయ నాయకులు కాదని, దొంగల గుంపు మాత్రమేనని, దొంగ వ్యాపారానికి అడ్డా అని పేర్కొన్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి పాలనలో ఐఏఎస్లను ఎలా బలితీసుకున్నారో చూశామని, ఇప్పుడు జగన్ పాలనలో ఐపీఎస్‌లను అదే విధంగా బలితీసుకుంటున్నారని ఆరోపించారు. కొంతమంది ఐపీఎస్‌లు వారి మాటలు నమ్మి ప్రవర్తించి సస్పెండ్ అయ్యారని, కోర్టులు చుట్టూ తిరుగుతున్నారని వివరించారు. సోషల్ మీడియా హద్దులు దాటి వ్యవహరించే సంస్కృతిని వైసిపి పార్టీనే పెంచిందని, అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ధనంతో కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి వ్యక్తిత్వ హననకు పాల్పడ్డారని తెలిపారు. ఇప్పటికీ ఆ పార్టీ అదే విధంగా ప్రజాస్వామ్య విలువలను దిగజార్చే పనులు చేస్తోందని అన్నారు. గోరంట్ల మాధవ్ లాంటి నేతల ప్రవర్తన కూడా అదే తరహాలో ఉందని, పోలీస్ గా పనిచేసిన వ్యక్తి ముద్దాయిపై ఎస్పీ కార్యాలయంలోనే దాడి చేయాలని ప్రయత్నించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఇలాంటి వారి వల్ల ప్రజాస్వామ్య విలువలు హక్కులు దిగజారుతున్నాయని చెప్పారు. ఇటీవల కవిత గారు పవన్ కళ్యాణ్ గారిపై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని, లిక్కర్ స్కాం కేసులో జైలుకు వెళ్లిన ఆమెకు పవన్ గారి గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా రాష్ట్రం కోసం శ్రమిస్తున్నారని, అలాంటి వ్యక్తిపై దుష్ప్రచారం చేయడం నీచ చర్య అని విమర్శించారు. కవిత గారు నిజంగా శుద్ధ మనసుతో ఉన్నవారు అయితే రాజకీయాల్లో ఉండకూడదని, తమపై మీడియా దృష్టి దిద్దించేందుకు పవన్ గారిపై విమర్శలు చేయడం చీప్ ట్రిక్స్ అని అన్నారు. చివరగా, జన సైనికులు ఎవరి జోలికి పోరని, కానీ తమ నాయకుడిపై ఎవరైనా తక్కువగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా తగిన జవాబు ఇస్తారని గాదె వెంకటేశ్వరరావు హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ శిఖా బాలు, కార్యదర్శి చట్టాల త్రినాథ్, కార్పొరేటర్ ఎర్రం శెట్టి పద్మావతి, తాడికొండ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment